యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 మాంచి రసవత్తరంగా సాగుతుంది. ఐపీఎల్ స్టార్ట్ కావడంతో సోషల్‌మీడియాలోనూ ట్రోల్స్, మీమ్స్ మొదలయ్యాయి. ఇటీవల మరీ క్రికెటర్ల భార్యలను, ప్రియురాళ్లను కూడా ఐపీఎల్ వివాదంలోకి లాగుతున్నారు. దీంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నీ కూతురుపై ఓ యువకుడు అసభ్యకరంగా కామెంట్ చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజగా మాజీ క్రికెటర్ , ప్రముఖ కామెంటర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. అతడి ట్వీట్‌కు సోషల్ మీడియా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.. ఆకాశ్ చోప్రా ఏమన్నారంటే.. 'ఐపీఎల్ ఫైనల్లో ముంబై, ఢిల్లీ తలపడవచ్చని నా అంచనా' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై, ఢిల్లీ దూసుకుపోతున్నాయి. చెరో 12 పాయింట్లతో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. 10 పాయింట్లతో ఆర్సీబీ మూడో స్థానంలో, 8 పాయింట్లతో కేకేఆర్ నాలుగు స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్, చైన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఆరు పాయింట్ల చొప్పున తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లు లీగ్ దశలో మరో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. ఇంకో 4 పాయింట్లు దక్కించుకొనే జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి.
ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. దీంతో ఆకాశ్ చోప్రా ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆకాశ్ చోప్రా ట్వీట్‌కు సన్‌రైజర్స్ మాజీ కోచ్ టామ్ కౌంటర్ ఇచ్చారు. మీకు అసలైన జట్టు (చైన్నై సూపర్‌కింగ్స్) కనిపించడం లేదా అంటూ రిప్లై ఇచ్చాడు. ఆకాశ్ చోప్రా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై, ఢిల్లీ దూసుకుపోతున్నాయి. చెరో 12 పాయింట్లతో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. 10 పాయింట్లతో ఆర్సీబీ మూడో స్థానంలో, 8 పాయింట్లతో కేకేఆర్ నాలుగు స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్, చైన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఆరు పాయింట్ల చొప్పున తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లు లీగ్ దశలో మరో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. ఇంకో 4 పాయింట్లు దక్కించుకొనే జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి.
అయితే ప్రస్తుతం పది పాయింట్లలో 10 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్న ఆర్సీబీ, ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధిస్తే నెట్ రన్‌రేట్ లాంటి సమీకరణలు అవసరం లేకుండా ప్లే ఆప్స్‌కు చేరుకుంటుంది. మరోవైపు ఈ సీజన్లో ఢిల్లీ, ముంబై జట్లు ఆద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి.
Can we have #MI vs #DelhiCapitals finals already?