'ఢిల్లీ మోడల్' పేరుతో దేశ రాజధానిలో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేస్తూ విస్తరణ ప్రణాళికలు రచిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలుగు రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. విద్య, వైద్య రంగాల్లో ఢిల్లీలో గుణాత్మక మార్పును తీసుకువచ్చినట్లే తమకు అవకాశం దొరికిన ఇతర రాష్ట్రాల్లో కూడా చేయనున్నట్లు వెల్లడిస్తోంది. పంజాబ్, గోవా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పదేపదే ఇదే అంశాన్ని పస్తావించారు.
అంతేకాదు పంజాబ్లో పోలింగ్ జరుగుతుండగానే ఢిల్లీలో 12 వేల స్మార్ట్ తరగతులను సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితే ఏపీలోనూ 'ఆప్' బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.
యువత, మేధావి వర్గం టార్గెట్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, తదితర ప్రాంతాల్లో పోటీ చేయాలని ఆప్ తమ మ్యాప్ రెడీ చేసుకున్నట్లు చెప్తున్నారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా ప్రజలకు ఆప్ పరిచయం చేసినట్లు అవుతుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే, అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాలంటే ముందుగా క్షేత్రస్థాయిలో బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేలా నాయకత్వాన్ని తక్షణం తయారుచేసుకోవాలి. ఏపీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన నాయకత్వం, పెద్ద సంఖ్యలో కేడర్ లేకపోవడం ప్రధాన సమస్య. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఆ పార్టీ ఉనికిలో కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి ముద్ర లేని మాజీ ఉన్నతాధికారులు, చురుకైన యువతను చేర్చుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయ్నతిస్తున్నట్టు సమాచారం.
కాగా, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాలపై ఆప్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్కు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డింది.
2024 లోక్‌సభ ఎన్నికల వరకు ఉత్సాహంగా పనిచేసేందుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా వస్తే 'ఆప్' ఎటువంటి వ్యూహం అవలంభిస్తుందో చూడాలి.
ఇదిలాఉండగా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏడు స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, జహీరాబాద్, నల్లగొండ, వరంగల్ నుంచి పోటీ చేసిన 'ఆప్' అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు.