ఏపీ రాజ‌కీయాల్లోకి ఆప్

Update: 2022-03-11 02:30 GMT
ఎప్ప‌టి నుంచో తెలుగు ప్రాంతాల‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులతో మంచి బంధాలు న‌డిపి ఉన్నారు కేజ్రీవాల్. పార్టీని పూర్తి స్థాయిలో విస్త‌రించ‌లేక పోయినా శ్రీ‌కాకుళం లాంటి మారుమూల జిల్లాల్లోనూ ఆయ‌న కార్య‌క‌ర్త‌లు, కార్య‌వ‌ర్గ స‌భ్యులు అంతో ఇంతో స్థాయిలో స‌మాజాన్ని ప్ర‌భావితం చేస్తూనే ఉన్నారు.

ఇవాళ పంజాబ్ లో అనూహ్య రీతిలో విజ‌య దుందుభి మోగించిన కేజ్రీవాల్ ( ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌) త్వ‌ర‌లో తెలుగు రాష్ట్రాల‌పై మ‌రింత దృష్టి సారించ‌నున్నారు.గ‌తంలో మాదిరిగా కాకుండా దేశ వ్యాప్తంగా పార్టీ విస్త‌ర‌ణ‌కు ఆయ‌న ప్ర‌ణాళిక‌ను ర‌చిస్తున్నారు.బాగా చ‌దువుకున్న వ‌ర్గానికి చెందిన నేత‌లే ఆమ్ ఆద్మీ పార్టీ స‌భ్యులుగా ఉంటూ వ‌స్తున్నారు.వారే లీడ్ రోల్ ను ప్లే చేస్తున్నారు.

తాజా ఫ‌లితాల నేప‌థ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు తీన్మార్ ఆడుతున్నారు. గ్రామాల్లో కూడా కొంద‌రు ఆమ్ ఆద్మీ పార్టీ అవ‌గాహ‌న పెంచేందుకు ఎప్ప‌టి నుంచో కృషి చేస్తున్నారు.ఇది సామాన్యుడి పార్టీ ఇది సామాన్యుడి శ‌క్తిని పెంచే పార్టీ అని ఎప్ప‌టి నుంచో కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు.క‌నుక వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌కుల‌కు ఆమ్ ఆద్మీ పార్టీ అవ‌కాశం ఇస్తే మంచి ఫ‌లితాలే వ‌స్తాయి.

ఎలానూ ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఆ పార్టీ దేశంలో ఎదిగేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటుంది క‌నుక ఆ దిశగా కొన్ని మంచి ఆలోచ‌న‌లు చేస్తే మంచి ఫ‌లితాలే వ‌స్తాయి.ముఖ్యంగా లోక్ స‌త్తా లాంటి పార్టీలు చేసిన త‌ప్పిదాలు చేయ‌కుండా ఉంటే, సీబీఐ మాజీ ఉన్న‌తాధికారి జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ లాంటి లీడ‌ర్ల‌తో క‌లిసి ప‌నిచేస్తే ప్ర‌త్యామ్నాయ శ‌క్తి గా ఆ పార్టీ అవ‌త‌రించేందుకు అవ‌కాశాలే మెండు.

ఇప్ప‌టికిప్పుడు కాకున్నా రానున్న కాలంలో పొత్తులు పెట్టుకుని ముందుకుపోతే ఫ‌లితాలు వ‌స్తాయి.ఎలానూ టీడీపీ కొన్ని స్థానాల‌లో పెద్ద‌గా  బ‌ల‌ప‌డేందుకు అవ‌కాశాలు లేవు క‌నుక ఆప్ తో దోస్తీ క‌డితే మేలు అన్న వాద‌న కూడా ఉంది.
Tags:    

Similar News