ఏపీలో కొత్త పార్టీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా వెలువడ్డ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాలో గెలవగా... ఆప్ పంజాబ్ లో ఏకపక్ష విజయంతో అధికారం దక్కించుకుంది. రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రాంతీయ పార్టీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు చీపురు పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్..గుజరాత్.. రాజస్థాన్ లలో పార్టీ విస్తరణ కోసం ఆప్ పావులు కదుపుతోంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అవకాశాల పైన అధ్యయనం చేస్తోంది.
ఇందు కోసం ఆప్ ప్రత్యేకంగా కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. వచ్చే నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి నాడు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ లోగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆప్ ముఖ్య నేత సోమనాథ్ భారతి పర్యటించనున్నట్లు తెలిసింది. స్థానికంగా ఆప్ నేతలు వచ్చే నెల 14వ తేదీ నుంచి పార్టీ సభ్యత్వం పైన ఫోకస్ పెడుతున్నారు. దీనికి సంబంధించి ఊరూ వాడా ప్రచారం ముమ్మరం చేశారు. ఆప్‌లో చేరండంటూ.. ప్రత్యేక కార్యక్రమాలుసైతం నిర్వహిస్తున్నారు. దీనికి బాగానే స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక, సోమనాథ్ భారతి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన సమయంలో స్థానికంగా ఉన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటుగా.. తమ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న వారితో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఏప్రిల్ 14వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా పాదయాత్రలకు ఆప్ వ్యూహాలు సిద్దం చస్తోంది. ఇది ఆప్ విస్తరణలో తొలి అడుగులుగా భావిస్తున్నారు.
ఏపీలో ప్రధాన పార్టీలు ప్రధాన సామాజిక వర్గాల అనుకూల పార్టీలుగా మారాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీంతో పాటుగా రాజకీయ శూన్యత ఉందని.. సరైన నాయకుడు .. సరైన అజెండాతో ముందుకు వస్తే ఏపీలో పార్టీ ఎదుగుదలకు అవకాశం ఉందని ఆప్ నేతలు చెబుతున్నారు.
అయితే, సొంతంగా ఎదిగేందుకు పార్టీకి సమయం తీసుకున్నా.. ముందుగా టీడీపీ లేదా జనసేనతో పొత్తు పైన అంతర్గతంగా ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు వైపే ఏపీలో ఉన్న కొందరు ఆప్ నేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే, పొత్తు కంటే సమయం తీసుకున్నా.. సొంతంగా ఎదిగితేనే ప్రత్యామ్నాయంగా ప్రజలు గుర్తిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఢిల్లీలో ఆప్ పాలన..పంజాబ్ లో ఆప్ గెలిచిన తీరు చూసిన తరువాత సాధారణంగానే ఏ పార్టీకి మద్దతు ఇవ్వని న్యూట్రల్ గా నిలచే వారితో పాటుగా యువత..విద్యా వేత్తలు..సమాజంలో గుర్తింపు ఉన్న వారు ఆకర్షితులవుతున్నారు.
దీంతో.. సభ్యత్వ నమోదు చేయించేందుకు పాదయాత్ర చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించటంతో వచ్చే ఎన్నికల నాటికి ప్రభావం ఎంత మేర ఉంటుందనే చర్చ మొదలైంది. సాధారణంగా ఏ పార్టీ మద్దతు దారులు ఆ పార్టీలకే ఓటు వేస్తారు. అయితే, తటస్థంగా ఉండే వారు ఓట్లే గెలుపు ఓటముల్లో ఏపీల ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. దీంతో..ఆప్ పాత్ర ఏపీలో ఏ విధంగా ఉండబోతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే ఏ పార్టీకి నష్టం చేస్తుందనే అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పొత్తులు..ఆప్ కార్యాచరణ ఖరారు అయిన తరువాత పార్టీ ప్రభావం పైన ఒక స్పష్టత వచ్చ అవకాశం ఉంది.