బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తాను భారతదేశాన్ని ప్రేమిస్తున్నానని.. అది తన మాతృభూమి అని.. భారతీయుడిగా పుట్టటానికి గర్వపడుతున్నానని.. తాను ఏ దేశానికి వెళ్లాలని అనుకోవటం లేదని.. తనకు కానీ తన భార్యకు కానీ అలాంటి ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. గోయంకా అవార్డు ఫంక్షన్ కార్యక్రమానికి వెళ్లిన అమీర్ ఖాన్ అక్కడ మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న మత అసహనం మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల గురించి తన భార్య కిరణ్ రావ్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఒకదశలో దేశం విడిచిపోవాలన్న ఆలోచనను చెప్పినట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు.
అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. ఆయన వ్యాఖ్యల్ని పలువురు ఖండించటంతో పాటు.. ఆయన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న ఉత్పత్తుల్ని బహిష్కరించాలంటూ పిలుపునివ్వటం మొదలైంది. అదే సమయంలో ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న స్నాప్ డీల్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేయటం మొదలు పెట్టారు. ఒక రోజు వ్యవధిలోనే వేలాది మంది తమ యాప్ లు అన్ ఇన్ స్టాల్ చేసుకోవటంతో పాటు.. సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి.
ఈ నేపథ్యంలో.. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఒక ప్రకటన జారీ చేశారు. తాను ఇచ్చిన ఇంటర్వ్యూ మొత్తాన్ని వినాలని చెప్పిన ఆయన.. తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నట్లు.. దేశాన్ని విడిచివెళ్లాలని అనుకోవటం లేదంటూ వెల్లడించారు. అయితే.. ఇంటర్వ్యూ లో చెప్పిన అంశాలకు తాను కట్టుబడి ఉన్నట్లుగా ప్రకటించారు. తన ఇంటర్వ్యూను పూర్తిగా చూడని వాల్లే కావాలని తన మీద బురదజల్లేందుకు ప్రయత్నించారని.. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారన్నారు.
భారత దేశంలో తాను పుట్టినందుకు చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లుగా పేర్కొన్న అమీర్ ఖాన్.. తాను ఇక్కడే శాశ్వితంగా ఉండనున్నట్లు స్పష్టం చేశాడు. తన మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పినందుకు తనపై నిందలు వేస్తున్నారని.. తద్వారా తాను చెప్పిన విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నందుకు చాలా విచారకరంగా ఉందన్నాడు.
అమీర్ తీరు చూస్తుంటే.. తన మనసులోని మాటల్ని చెప్పొచ్చు కానీ.. ఎదుటి వారు తమ మనసులోని మాటల్ని చెప్పకూడదన్నట్లుగా ఉంది. భారత్ నుంచి వెళ్లిపోవాలని చెప్పిన వ్యక్తికి.. వెళ్లిపో నాయనా? టిక్కెట్లు కావాలంటే చెప్పండి.. డబ్బుల్లేకున్నా ఏదో ఒక సర్దుబాటు చేసి ఇస్తామంటూ అభిమానంతో అన్న మాటల్ని అమీర్ అపార్థం చేసుకుంటే ఎలా? మనసులోని మాటలు బయటకు చెప్పటం తప్పు కాదు. కానీ.. మనసులో అయితే కన్నతల్లిని.. పుట్టిన నేల మీద అభిమానాన్ని చూపించాలిగా?
కన్నతల్లి తిట్టిందని.. నా తల్లి నాకు నచ్చలేదని కన్నబిడ్డ వెళ్లిపోతాడా? పుట్టిన నేలలో ఏదైనా తేడాలున్నప్పుడు.. మంచిగా లేనప్పుడు దాన్ని మార్చే ప్రయత్నం చేయాలే కానీ.. నేను.. నా కుటుంబం అంటూ నా దారిన నేను విదేశాలకు పోతానని చెబితే.. ఏం పట్టనట్లు చూస్తుండిపోవాలా? గుండెల నిండుగా అభిమానం నింపుకున్న తమ అభిమాన నటుడు.. మాతృదేశం పట్ల వ్యాఖ్యలు చేసినా.. మనసులో మాట చెప్పాడని స్పందించకుండా ఉండాలా? అమీర్ కోరుకుంటున్న చైతన్యం ఇదేనా..?