భారతదేశంలో కోట్లాది మంది మెచ్చిన హీరో అమీర్ ఖాన్.. కానీ, ఆయన మాత్రం భారతీయులు నొచ్చుకునేలా మాట్లాడారు. తనను అభిమానించుకునేవారే అసహ్యించుకునేలా మాట్లాడారు. దేశంలో మత అసహనం పెరిగిపోతోందని... తన భార్య కూడా ఇండియాలో ఉండలేమేమో, ఇండియాను విడిచిపోవాల్సి వస్తుందేమో అంటోందంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సినీరంగం నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచీ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమీర్ ఖాన్ ప్రస్థానం.. ఆయనకు ఈ దేశంలో దక్కిన గౌరవం... ఈ దేశం ఆయనపై చూపించిన అభిమానం.. నెత్తికెక్కించుకున్న వైనం చూసిన వారెవరైనా సరే అమీర్ ఖాన్ వ్యాఖ్యలను
తప్పుపడతారు. దేశంలో అసహనమే ఉంటే అమీర్ ను బాలీవుడ్ అగ్రహీరోను చేయడం... ఇంతవరకు ఇద్దరు హిందువులను పెళ్లాడినా ఎవరూ ఆ సంగతే పట్టించుకోకపోవడం.. అవార్డులు - పురస్కారాలు ఇచ్చి తరగని కీర్తిని అందివ్వడం వంటివి సాధ్యమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ లో అమీర్ - షారుక్ - సల్మాన్ లు రాజ్యమేలుతుండడం పరమత సహనానికి ప్రతీక కాదా అని ప్రశ్నిస్తున్నారు.
అమీర్ అహంకారపూరిత వ్యాఖ్యలపై సినీరంగం మండిపడుతోంది. 'ఇన్ క్రెడిబుల్ ఇండియా నీకు ఇంటాలరెంట్ ఎప్పడైంది? గత ఏడెనిమిది నెలలో మాత్రమేనా?' అంటూ బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ప్రశ్నించారు. అమీర్ వంటి ఐకాన్స్ ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలే కానీ భయాన్ని రేకెత్తించకూడదని అన్నారు. గతంలో ఇంతకంటే భయంకర మైన పరిస్థితులు ఉన్నప్పుడు అమీర్ ఎందుకు గొంతు విప్పలేదని ఆయన ప్రశ్నించారు. 'ఇంతకంటే భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడే జీవించానని, ఇతర దేశాలకు వెళ్లాలనే ఆలోచన రాలేదని నీ భార్యకు చెప్పావా? ఏ దేశానికి వెళ్లాలనుకుంటోందో నీ భార్యను అడిగావా? ఈ దేశం నిన్ను అమీర్ ఖాన్ ను చేసిందని ఆమెకు చెప్పావా?' అంటూ అనుపమ్ ఖేర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
నిజమే ఈ ప్రశ్నను అమీర్ ఖాన్ తనకు తాను వేసుకోవాలి. మనుషులను జంతువుల్లా చూసే అడవి మృగాలున్న సౌదీ అరేబియాకు వెళ్లాలనుకుంటున్నాడా...? లేదంటే నలుపు - తెలుపు రంగుల తేడాలున్న అమెరికాలో హాయిగా బతకాలనుకుంటున్నాడా...? భారతీయులను తరిమితరిమి కొడుతున్న ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉండాలనుకుంటున్నాడా... మాఫియా డాన్ దావూద్ ను అక్కున చేర్చుకున్న దుబాయి - పాకిస్థాన్ లకు వెళ్లాలనుకుంటున్నాడా.. లేదంటే ఏకంగా సిరియా - ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న ఇస్లామిక్ స్టేట్ లో జీవించాలనుకుంటున్నాడా? అమీర్ ఖాన్ ఏమనుకుంటున్నాడు. ఇండియా కంటే ఇవన్నీ సేఫ్ అనుకుంటున్నాడా? లౌకికత్వమే జీవనతత్వమైన ఇండియాలో కాకుండా ఇంకెక్కడైనా అడుగు పెడితే అమీర్ ఖాన్ మనగలడా..? ఆయన ఇండియాలో కాకుండా ఇంకేదేశంలోనైనా పుట్టి ఉంటే ఫకీర్ ఖాన్ గానే ఉండేవాడు.
తనను ఈ దేశం ఎంతగా ఆదరించిందో, ఎంతగా భరించిందో ఆయన గుర్తు చేసుకుంటే ఈ మాటలు అనేవాడు కాదేమో. అమీర్ కుటుంబం నుంచి దాదాపు పదిమంది సినిమా రంగంలో ఉన్నారు. అంతేకాదు.. అమీర్ తొలుత రీనాదత్తా అనే హిందువును పెళ్లాడి పదిహేనేళ్లు కాపురం చేసి ఇద్దరు పిల్లలతో ఆమెను వదిలేస్తే భారతదేశం ఆయన్ను పల్లెత్తు మాటనలేదు. అదే గల్ఫ్ దేశంలో అయితే ఆయన్ను రాళ్లతో కొట్టేవారేమో. ఆ తరువాత కూడా ఆయన మరో హిందువు కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు... తనతో పాటే సినిమాల్లో అడుగుపెట్టిన తమ్ముడు ఫైసల్ ఖాన్ కు కెరీర్ ను అణగదొక్కింది కూడా అమీరేనని చెబుతారు. ఫైజల్ కు మతిభ్రమించిందని చెప్పి అమీర్ ఇంట్ లో బంధించేస్తే తండ్రి జోక్యం చేసుకుని కోర్టు ద్వారా అయన్ను రక్షించాల్సి వచ్చింది. ఇన్ని చేసినా ఇండియా అతని పర్సనల్ లైఫ్ లో జోక్యం చేసుకోలేదు. వీటన్నిటినీ సహనమనాలో అసహనమనాలో అమీరే చెప్పాలి.
అమీర్ జీవితాన్ని చూస్తే అసహనంపై మాట్లాడే అర్హతే ఆయనకు లేదని చెప్పాలి. ఈ దేశం నాకేమిచ్చిందని భారతీయులంతా ఎవరికి వారు ప్రశ్నించుకుంటే అందులో 99 శాతం మందికి సమాధానం దొరకదు. ఒక శాతం మంది దేశం వల్ల తాము లాభపడ్డామని సంతృప్తి చెందుతారు. ఇక అమీర్ లాంటి వారు గుండెల మీద చేయి వేసుకుని నిజాయితీగా తమను తాము ప్రశ్నించుకోవాలే కానీ... ఈ దేశం వారికి ఏమిచ్చిందన్నది చెప్పుకోవడానికి రోజులు చాలవు. రాయడానికి పుస్తకాలు చాలవు. అన్నీ ఇచ్చి హీరోను చేసిన దేశాన్ని, దేశ ప్రజలను అవమానిస్తూ అమీర్ వంటివారు చేసే వ్యాఖ్యల్లో కంటే అసహనం ఇంకెక్కడ ఉందో ఆయన్ను ఇంతకాలం అభిమానించినవారంతా అర్థం చేసుకోవాలి.