అఫిషియల్ - కర్నాటకలోకి ఆప్ వయా బెంగుళూరు

Update: 2022-04-24 08:30 GMT
పంజాబ్ లో గెలుపు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కర్నాటకపైన కన్నేసింది. 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుండి రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే తొందరలో జరగబోయే బెంగుళూరు నగరపాలక సంస్ధ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే స్థానాల ఆధారంగా తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల్లో గెలుపుకు ప్లాన్ చేయబోతున్నది.

ఈ విషయాలను స్వయంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత జనాల్లో ముఖ్యంగా మధ్యతరగతి వారిలో ఆప్ పై క్రేజ్ పెరిగిన మాట వాస్తవం.  ఢిల్లీకి మూడోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేజ్రీవాల్ పై ఇప్పటివరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. పైగా క్లీన్ ఇమేజుంది. అందుకనే పంజాబ్ లో జనాలు ఆప్ కు పట్టంకట్టారు. దాంతో ఇఫుడు దేశమంతా ఆప్ గురించి ఆలోచిస్తోంది.

ఇతర పార్టీలకు, ఆప్ కు మధ్య జనాలు తేడాలను గమనిస్తున్నారు. అందుకనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆప్ పై జనాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఢిల్లీ, పంజాబ్ తర్వాత కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. నిజంగా జరుగుతుందో లేదో తెలీదు కానీ గౌరప్రదమైన స్ధానాలు తెచ్చుకుంటే చాలు ఆప్ పేరు దేశంలో మారుమోగిపోతుంది. కర్నాటక మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని ఆప్ నేతలు, కార్యకర్తలు మంచి జోరుమీదున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.

2014 లోక్ సభ ఎన్నికల్లో ఆప్ పోటీ చేసినా ఉపయోగం కనబడలేదు. 2015లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 29 నియోజకవర్గాల్లో పోటీచేసి అన్నింటిలోను ఓడిపోయింది. అయితే పంజాబ్ లో గెలుపు తర్వాత మాత్రం క్రేజ్ పెరిగిందన్నది వాస్తవం. ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీతో జనాలు బాగా విసిగిపోతున్నారు. ఈ విషయంలోనే కేజ్రీవాల్ చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. రెగ్యులర్ గా రాష్ట్రంలో టూర్ చేయాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఆప్ వైపు జనాలు మొగ్గుచూపుతారనే అంచనాలున్నాయి.  మరి ఎన్నికల్లో ఏమవుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News