కరోనా వైరస్ పై జనాల్లో బొత్తిగా భయం లేకుండా పోయింది. కరోనా వైరస్ సోకిన నాలుగు రోజులకే ట్రంప్ ఆస్పత్రిని వీడి అధ్యక్ష భవనంలోకి వచ్చేశాడు. ఇక మన దేశంలోనూ అలాంటి నాయకులు ఏకంగా రోడ్ల మీదకు వచ్చి ప్రజలతో కలిసిపోయిన దారుణం వెలుగుచూసింది.
కరోనా వైరస్ సోకితే నిబంధనల ప్రకారం కనీసం 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. హోం లేదా ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది. అలా అయితే అతడి నుంచి వైరస్ మరొకరికి వ్యాపించదు.
అయితే జనాల్లో భయానికి సామాన్యులు అంతా ఈ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తున్నారు. రాజకీయ నాయకులు మాత్రం ఈ రూల్స్ ను బ్రేక్ చేసి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటున్న వైనం వెలుగుచూసింది.
సెప్టెంబర్ 29న ఢిల్లీలోని కొండ్లి నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ కు కరోనా సోకింది.ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో స్వయంగా తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. హోం క్వారంటైన్ లో ఉన్నట్టు పేర్కొన్నారు.
అయితే అది జరిగిన ఐదు రోజులకే అక్టోబర్ 2న కుల్దీప్ యూపీలోని హత్రాస్ వెళ్లాడు. అక్కడా బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కుల్దీప్ వెళ్లినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కరోనా సోకిన ఐదురోజులకే ఎమ్మెల్యే బయటకు రావడంతో ఆయనపై యూపీ పోలీసులు అంటువ్యాధి నివారణ చట్టం కింద కేసు నమోదు చేశారు.