ఆ రాష్ట్ర మంత్రి ఎగ్గొట్టిన ప‌న్ను రూ.120 కోట్లు..?

Update: 2018-10-14 06:13 GMT
షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించింది ఆదాయ‌ప‌న్ను శాఖ‌. నిత్యం నీతులు చెప్పే పార్టీకి చెందిన ముఖ్య నేత‌కు సంబంధించిన ఒక కొత్త విష‌యాన్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించింది. ఆమ్ ఆద్మీ పార్టీగా సామాన్యుల‌కు చాలా చేస్తామ‌ని మాటిచ్చి మ‌రీ ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌గ్గాలు చేప‌ట్టిన అర‌వింద్ కేజ్రీవాల్ కాబినెట్ మంత్రి ఒక‌రు ఐటీ శాఖ‌కు రూ.120 కోట్లు ఎగ్గొట్టిన‌ట్లుగా పేర్కొంది.

కేజ్రీవాల్ మంత్రివ‌ర్గంలోని మంత్రి కైలాశ్ గెహ్లాట్ రూ.120 కోట్ల మేర ప‌న్నును ఎగ్గొట్టిన‌ట్లుగా ఐటీ శాఖ పేర్కొంది. తాజాగా ఆయ‌న‌కు చెందిన ఆస్తులు.. కార్యాల‌యాల్లో దాడులు నిర్వ‌హించిన ఐటీ శాఖ‌.. తాజాగా షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించింది. తాము జ‌రిపిన సోదాల్లో కీల‌క ప‌త్రాలు ల‌భ్య‌మ‌య్యాయ‌ని పేర్కొన్నారు.

స‌ద‌రు మంత్రి రూ.120 కోట్ల మేర ఆదాయ‌ప‌న్నును ఎగ్గొట్టిన‌ట్లుగా ఐటీ శాఖ తేల్చి చెప్పింది. ప‌లు డొల్ల కంపెనీల పేరుతో త‌న ద‌గ్గ‌రి ఆఫీస్ బాయ్స్‌.. ప్యూన్స‌.. ఇత‌ర ఉద్యోగుల పేర్ల‌పై రూ.70 కోట్ల వ‌ర‌కూ రుణాలు తీసుకున్నార‌న్నారు. అందుకు సంబంధించిన ప‌త్రాల్ని తాము స్వాధీనం చేసుకున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

మంత్రిగారికి సంబంధించిన ఆఫీసుల్లోని సాధార‌ణ ఉద్యోగుల పేరు మీద భారీగా ఆస్తులు ఉన్న‌ట్లుగా గుర్తించిన‌ట్లు ఐటీ అధికారులు ప్ర‌క‌టించారు. డ్రైవ‌ర్ పేరు మీద పెద్ద మొత్తంలో భూమి ఉంద‌ని.. దుబాయ్ లోని రియ‌ల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబ‌డులు  పెట్టిన‌ట్లుగా తాము గుర్తించిన‌ట్లు చెబుతున్నారు.  ఇదిలా ఉంటే.. తాజాగా త‌న మంత్రిపై ఐటీ అధికారులు జ‌రిపిన దాడుల్ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి ఎప్ప‌టిలానే ఖండించారు. త‌న ఇమేజ్ నుడ్యామేజ్ చేసేందుకే ఈ త‌ర‌హా దాడులు చేస్తున్న‌ట్లుగా ఆరోపించారు. కానీ.. ఒక రాష్ట్ర మంత్రి ఇంత భారీగా ఆదాయ‌ప‌న్ను ఎగ‌వేసిన వైనం ఈ మ‌ధ్య‌న బ‌య‌ట‌కు రాలేదంటున్నారు.
Tags:    

Similar News