బీజేపీ వాళ్లు ఆమెతో బేరం పెట్టార‌ట‌

Update: 2017-04-26 10:03 GMT
ఢిల్లీ మున్సిపాలిటీకి జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు పూర్తిగా విడుద‌ల కాక ముందే ఢిల్లీ రాజ‌కీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌య‌ఢంకా మోగిస్తుందంటూ వెలువ‌డిన అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉండ‌డ‌టం ఒక విశేష‌మైతే.. ఈ ఫ‌లితాల‌పై బీజేపీ.. ఆమ్ ఆద్మీపార్టీ నేత‌ల మ‌ధ్య వాదులాట అంత‌కంత‌కూ పెరుగుతోంది. ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చార‌ని.. కేజ్రీవాల్ పాల‌న‌పై వారు విసిగిపోయిన‌ట్లుగా బీజేపీ నేత‌లు చెబుతుంటే.. ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్‌ చేసిన త‌ర్వాత ఇలాంటి ఫ‌లితాలు  రాక మ‌రెలాంటి ఫ‌లితాలు వ‌స్తాయంటూ త‌మ‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్నారు ఆమ్ ఆద్మీ నేత‌లు.

తాజాగా వెలువ‌డిన ఫ‌లితాల్ని తాము అంగీక‌రించ‌మ‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబా (చాందినీ చౌక్‌) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌కు బీజేపీ గాలం వేస్తోంద‌ని వ్యాఖ్యానించారు. త‌న‌తో క‌మ‌ల‌నాథులు బేరాలు ఆడార‌న్నారు. తాను కానీ బీజేపీలోకి వెళితే.. బీజేపీ మ‌హిళా నేత షాజియా ఇల్మితో స‌మానంగా పార్టీలో హోదా ఇస్తామ‌న్న ఆశ పెట్టిన‌ట్లుగా చెప్పారు. ఆప్ ప‌ని అయిపోయింద‌ని.. త‌మ పార్టీలోకి వ‌చ్చేయాల‌ని బీజేపీ నేత‌లు ఫోన్లు చేస్తున్నార‌న్నారు.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌.. ఉత్త‌రాఖండ్‌ లో మాదిరి ప్ర‌ధాని మోడీ త్వ‌ర‌లోనే ఢిల్లీలోనూ రాష్ట్రప‌తి పాల‌న విధించ‌నున్న‌ట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నేత‌లు త‌న‌తో మాట్లాడిన వివ‌రాల్ని ఉప ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడియాకు వెల్ల‌డించిన‌ట్లుగా వెల్ల‌డించారు.ఇదిలా ఉంటే త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మూడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్థి ఓట‌మి చెంద‌టంపై లాంబా నైతిక‌ బాధ్య‌త వ‌హిస్తూ.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లుగా ట్విట్ట‌ర్‌ లో పేర్కొన్నారు.  మొత్తంగా లంబా తాజా వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News