దేశ రాజకీయాల్ని మార్చేస్తామని.. కొత్త రాజకీయాన్ని ప్రజలకు చూపిస్తామంటూచెప్పటమే కాదు.. ఢిల్లీ ప్రజల మనసుల్ని దోచుకొని మరీ బంపర్ మెజార్టీతోపవర్ లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దేశంలోని మరే అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలపై కూడా నమోదు కాని కేసులు ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలపై నమోదు కావటం గమనార్హం. ఈ కేసుల్లో అత్యధికంగా మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపైనే ఈ కేసులు నమోదు అవుతుండటం గమనార్హం.
మొన్నటికి మొన్న ఆఫ్ ఎమ్మెల్యే దినేశ్ మోహానియాపై మహిళల్ని వేధించినఅంశంపై కేసు నమోదు కాగా.. తాజాగా దేవ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్ పై వేధింపుల కేసు నమోదైంది. ఒక మహిళ (భద్రతా కారణాల రీత్యాసదరు మహిళ వివరాల్ని పోలీసులు బయటపెట్టలేదు) గ్రేటర్ కైలాశ్ పోలీస్ స్టేషన్ లో ఆఫ్ ఎమ్మెల్యే ప్రకాశ్ మీద ఫిర్యాదు చేశారు. సదరు ఎమ్మెల్యే తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఆమె వాపోయారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇదే ఎమ్మెల్యే (ప్రకాశ్ జార్వాల్)పై గతంలోనూ ఒక మహిళా అధికారిపై చేయి చేసుకున్నారన్న ఆరోపణపై కేసు నమోదైంది. తాజాగా పోలీసుల దృష్టికి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 354.. 506.. 509.. 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నామని.. తర్వాతే ఎమ్మెల్యేపై చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే.. మహిళలపై ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలన్న అంశంపై తన ఎమ్మెల్యేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక క్లాస్ లు నిర్వహించాల్సిన అవసరం ఉన్నట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.