‘సామాన్యుడి’ ఎంపీ చేయకూడని పని చేసేశారు

Update: 2016-07-22 04:44 GMT
వివాదాలకు ఆమ్ ఆద్మీ నేతలకు ఉన్న రిలేషన్ మరే పార్టీ నేతలకు ఉండదేమో. తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే ఆ పార్టీ నేతలకు తగ్గట్లే తాజాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ తన వ్యక్తిగత కారులో పార్లమెంటుకు వెళుతూ చేయకూడని పనిని చేసేశారు. కారులో పార్లమెంటుకు వెళుతూ.. లోపలికి వెళ్లే దారి మొత్తాన్ని.. సెక్యూరిటీ పాయింట్లను మొత్తంగా రికార్డు చేసేశారు.

అక్కడి ఆగని ఆయన ఆ 12 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశారు. ఈ ఇష్యూ పెను దుమారం రేపి.. పెద్ద ఎత్తున విమర్శలు విరుచుకుపడటంతో తాను చేసిన పనిలో తప్పేముందంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

ఉగ్రవాదులకు అవకాశం కల్పించటం.. భద్రతా వ్యవస్థ ఎలా ఉందన్న విషయాన్ని ఇట్టే అర్థమయ్యేలా చేసిన ఆయన వీడియో పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంతో ఒక ఎంపీ వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎవరి కోసం ఈ ఎంపీ చేశారన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. మరోవైపు ఈ అంశాన్ని లోక్ సభ స్పీకర్ చాలా సీరియస్ గా తీసుకున్నారని.. ఏ క్షణంలో అయినా ఆప్ ఎంపీపై చర్యలు తీసుకునే వీలుందని చెబుతున్నారు.

Tags:    

Similar News