ఆప్ పరిస్థితి అక్కడ అంత ఘోరమా.. నోటానే బెస్ట్ ?

Update: 2019-10-25 20:30 GMT
ఆమ్ ఆద్మీ పార్టీ ...దేశ రాజకీయాలలో ఈ పార్టీకి ఒక ప్రముఖ స్థానం ఉంది. దేశ రాజధాని ఢిల్లీని ఆ పార్టీ ఏలుతోంది. నేషనల్ పార్టీలైన కాంగ్రెస్ , బీజేపీ ని సైతం వెన్కక్కి నెట్టి ఢిల్లీలో అధికారం చేపట్టింది. దీనితో ఆమ్ ఆద్మీ పార్టీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరింపచేయాలని ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల వేళ  అప్ తరఫున అభ్యర్థులను నిలుపుతూ వస్తోంది.

తాజాగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కూడా పోటీ చేసింది.  ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ రాష్ట్రాల్లో బోణీ కొట్టాలని బరిలోకి  దిగిన అప్ ఎన్నికల ఫలితాలు చూసి షాక్ లోకి వెళ్ళిపోయింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్ ఏమాత్రం ప్రభావం చూపలేక పోటీ చేసిన అన్ని స్థానాలలో ఓటమిపాలైంది. మహారాష్ట్రలో 24 స్థానాల్లో, హర్యానాలో 46 స్థానాల్లో పోటీ చేసింది. అయితే మొత్తం 70 సీట్లలో ఆప్ అభ్యర్థులు ఓటమి చెందారు.

రాజకీయాలలో ఓటమి అనేది పెద్ద సమస్య కాకపోయినా , కనీసం అప్ ఇతర పార్టీలకి గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. అప్ కి  నోటా కంటే తక్కువ ఓటింగ్ శాతం రావడం గమనార్హం. హర్యానాలో ఆ పార్టీకి 0.48 శాతం ఓట్లు రాగా.. నోటాకు 0.53 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక మహారాష్ట్రలో నోటాకు 1.37 శాతం ఓట్లు రాగా.. ఆప్‌కు కేవలం 0.11 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
Tags:    

Similar News