దేశంలో మరే రాజకీయ పార్టీకి ఎదురుకాని చిత్రవిచిత్రమైన ఇష్యూలు ఢిల్లీ రాష్ట్ర అధికారపక్షమైన అమ్ ఆద్మీ పార్టీకి ఎదురవుతుంటాయి. తాజాగా అలాంటి విచిత్రమైన కష్టం ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురైంది. ఎక్కడైనా అధికారపక్ష పార్టీకి తిరుగులేని రీతిలో ఉంటుంది. అలాంటిది.. అధికారపార్టీ కార్యాలయం అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఢిల్లీ ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది.
ప్రభుత్వ భవనాన్ని అక్రమంగా ఆక్రమించుకొని అందులో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని.. అందుకు ప్రతిగా రూ.27 లక్షల్ని చెల్లించాలని పబ్లిక్ వర్క్స్ శాఖ ఒకటి నోటీసులు పంపింది. లైసెన్స్ ఫీజు కంటే దాదాపు 65 రెట్లు ఎక్కువగా అద్దె ఉంటుందని పేర్కొంది.
అద్దెను చెల్లించే విషయంలో లేట్ చేస్తే.. ఈ మొత్తం నెల.. నెలకూ ఎక్కువ అవుతుందన్న వార్నింగ్ కూడా ఇచ్చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని ఉత్తర ఢిల్లీలోని రోజ్ అవెన్యూలో నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ భవనం పబ్లిక్ వర్క్స్ శాఖది. ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందించకుండానే చట్టవిరుద్ధంగా భవనాన్ని ఆక్రమించుకొన్నారని సదరు శాఖ ఆరోపిస్తోంది.
అంతేకాదు.. అద్దెను చెల్లించకుండా.. చట్టవిరుద్ధంగా భవనాన్ని వినియోగిస్తున్నారని పేర్కొంటూ నోటీసులు పంపారు. ఈ భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అధికారపార్టీకి ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నోటీసులు ఇప్పుడక్కడ కొత్త కలకలాన్ని రేపుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/