దేశ రాజధాని న్యూఢిల్లీలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా సీఎం కేజ్రీవాల్ పని అయిపోయిందని పెద్ద ఎత్తున బీజేపీ - కాంగ్రెస్ లు ప్రచారం చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీ.. ఉత్తరప్రాంతంలోని బావానా అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం అత్యంత ఉత్కంఠ వాతావరణం మధ్య సాగింది. ఇక్కడ ముక్కోణపు పోటీ చోటుచేసుకుంది. బీజేపీ - కాంగ్రెస్ లు సహా అధికార ఆప్ తన అభ్యర్థిని నిలిపింది.
ఈ ముక్కోణపు పోటీలో కాంగ్రెస్ - బీజేపీలు అధికార ఆప్‌పై నిప్పులు చెరిగాయి. ముఖ్యంగా సీఎం కేజ్రీవాల్ కేంద్రంగా తీవ్ర విమర్శలకు సైతం దిగాయి. దీంతో ఇక్కడ పోరు నంద్యాలను మరిపించింది. దీంతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మట్టికరవడం ఖాయమని అంచనాలు వెల్లువెత్తాయి. అయితే, అనూహ్యంగా ప్రజలు కేజ్రీవాల్ టీంకే పట్టంకట్టారు. బావానా అభ్యర్థిగా నిలబడిన ఆప్ అభ్యర్థి రామ్ చంద్ర సుమారు 22 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
తొలి రౌండ్ నుంచి స్వల్ఫ ఆధిక్యంలో ముందంజలో ఉంటూ వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర కుమార్ 12 రౌండో తర్వాత అనూహ్యంగా వెనకబడిపోయారు. క్రమక్రమంగా మెజార్టీ పెంచుకుంటూ పోయిన ఆప్ పార్టీ అభ్యర్థి చివరకు 56వేల 178 ఓట్లు సాధించి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. ఇక మూడో స్థానానికి పరిమితమవుతుందని భావించిన బీజేపీ అభ్యర్థి వేద ప్రకాశ్ చివరకు 34 వేల 501 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. గెలుపు మీద గంపెడు ఆశలు పెంచుకున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్‌కుమార్ 30వేల758 ఓట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. దీంతో ఈ ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. సిట్టింగ్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం ఢిల్లీలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం.