ఇప్పటికిప్పుడు ఎన్నికలకు సిద్ధమన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేయటం తెలిసిందే. దమ్ముంటే కేంద్రం ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమైతే.. తాను సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికల గోదాలోకి దిగుతానని పేర్కొనటం తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రే ఎన్నికల ఊసు తేవటంతో రాజకీయం రగులుకుంది.
ఎన్నికల వేడి ఎలా ఉన్నా.. ఎన్నికలు జరిగితే ఎవరి బలం ఎంతన్న అంశంపై ఆరాలు మొదలయ్యాయి. ఎవరికి వారు కసరత్తులతో పాటు.. ఇటీవల కాలంలో పెరిగిన సర్వేలు మరింత ఎక్కువ అయ్యాయి.ఇలాంటివేళ.. 'ఆరా'సంస్థ పేరుతో సర్వేలు నిర్వహించే మస్తాన్ ప్రెస్ మీట్ పెట్టి.. తాము చేసిన సర్వే ఫలితాల్ని వెల్లడించారు.
ఇందులో కేసీఆర్ కాన్ఫిడెన్సును దెబ్బ తీసేలా ఈ సంస్థ ఫలితాలు ఉండటం గమనార్హం. 2018 ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ కు లభించిన అధిక్యత తగ్గిపోయిన వైనాన్ని వెల్లడించారు.
అదే సమయంలో.. ఆ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేని బీజేపీ గడిచిన మూడేళ్లలో తెలంగాణలో ఎంత బలపడిందన్న విషయాన్ని వివరించారు. ఈసారి ఎన్నికల్లో విజయం మాదే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని చెబుతున్న కాంగ్రెస్ బలాన్ని వెల్లడించారు.
మొత్తంగా తెలంగాణ ప్రజల మూడ్ ఎలా ఉందన్న విషయాన్ని గణాంకాలతో సహా పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడే ఈ వివరాల్ని వెల్లడిస్తున్నారెందుకు? అన్న ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో తమ పేరుతో కొన్ని సర్వే రిపోర్టులు వైరల్ కావటం.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఒకసారి తమ సంస్థ చేసినట్లుగా చెప్పిన సర్వేలను ఉటంకించటంతో తాము మీడియా ముందుకు వచ్చినట్లుగా చెప్పారు. ఆయన వెల్లడించిన సర్వే వివరాల్ని చూస్తే..
- అధికార టీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గిపోతోంది. ఎన్నికల నాటికి అది మరింత పడిపోతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు 38.88 శాతం ఓట్లు వస్తాయి.. బీజేపీకి 30.48 శాతం ఓట్లు రానున్నాయి. కాంగ్రెస్ కు 23.71 శాతం ఓట్లు వస్తాయి. ఇతరులు 6.91 శాతం ఓట్లు రానున్నాయి.
- ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న ఓటింగ్ లో 8 శాతం తగ్గే వీలుంది. 2018 తర్వాత టీఆర్ఎస్ ఓటింగ్ శాతం పడిపోతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 46.87 శాతం ఓట్లు రాగా.. 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి అది కాస్తా 41.71 శాతానికి తగ్గింది. తర్వాత జరిగిన ఎన్నికల్ని చూసినప్పుడు ఓటింగ్ శాతం తగ్గింది.
- టీఆర్ఎస్ కు 87 స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు. 2014, 2018లో కేసీఆర్ బొమ్మ చూసి ఎమ్మెల్యేలకు ఓటు వేసినట్లు ఓటర్లు చెప్పారు. ఈసారి ఎన్నికల్లో అలాంటి అవకాశం లేదు.
- ఏపీలో పార్టీల మధ్య ఏర్పడే పొత్తుల వ్యవహారం తెలంగాణలోని సెటిలర్లపై ప్రభావం చూపనుంది. దాని ఆధారంగానే సెటిలర్లు ఓట్లు వేసే అవకాశం ఉంది.
- పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం తర్వాత కాంగ్రెస్ లో ఉత్సాహాన్ని గుర్తించాం. 2014, 2018 తర్వాత కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు టీఆర్ఎస్ లో చేరటంతో ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది.
- ప్రస్తుతం 18-35 ఏళ్ల మధ్యనున్న ఓట్లు ఎక్కువ మంది బీజేపీవైపు ఉన్నారు. బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 29 నియోజకవర్గాల్లో మాత్రమే బలమైన అభ్యర్థులు ఉన్నారు. బీ
- తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడ్డ ఉత్తరాదికి చెందిన వారంతా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు.
- ఈసారి ఎన్నికల అనంతరం ఒక పార్టీనే పెద్దదిగా అవతరిస్తుంది.
- బీఎస్పీ.. వైఎస్సార్ టీపీల ప్రభావం ఎక్కువగా నల్గొండ.. ఖమ్మం జిల్లాల్లోనే ఉంది. బీఎస్పీ ప్రభావం దళిత సామాజికవ ర్గంలో ఉండగా.. షర్మిల పార్టీ ప్రభావం రెడ్డి.. దళితుల్లో ఉండనుంది.
- రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఒకేసారి సర్వే చేయటం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే మూడు దఫాలుగా చేశాం. 2021 నవంబరులో 40 నియోజకవర్గాల్లో.. ఈ ఏడాది మార్చిలో 40 చోట్ల.. జులైలో 39 చోట్ల సర్వే చేశాం. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి నమూనాల్ని సేకరించాం.
- ఓటింగ్ శాతానికి తగ్గటానికి కారణాలివే..
1. ప్రజా సమస్యల కంటే సీఎం కేసీఆర్ కుటుంబ పాలన.. అవినీతి జరుగుతుందని విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి.
2. టీఆర్ఎస్ పాలన బాగున్నా.. కేసీఆర్ కుటుంబ అధిపత్యం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
3. ఎక్కువ మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. వారి వ్యక్తిగత ప్రవర్తన కూడా దీనికి కారణం.
4. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో కంటే పార్టీ క్యాడర్ లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది.
5. అధికార పార్టీవైపు ప్రస్తుతం పెన్షనర్లు.. కొంతశాతం మంది మహిళలే ఉన్నారు.