ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే అంతే..? ఎవరికి ఎందుకు అవకాశం ఇస్తుందో చెప్పలేం.. ఎంతోమంది మంచి విదేశీ ఆటగాళ్లున్నా.. వారు అందుబాటులో ఉన్నా.. వారిని కాదంటాయి ఫ్రాంచైజీలు. ఒకవేళ వారి బదులు కొనుక్కున్న వారేమైనా గొప్ప ఫామ్ లో ఉండి పరుగులు చేస్తున్నవారా? అంటే అదీ ఏమీ కాదు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో..? మచ్చుకు చెప్పాలంటే.. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్. విధ్వంసకరంగా కాకపోయినా టి20ల్లోనూ మెరుగ్గా రాణించగల సత్తా ఉన్న ఆటగాడు.
విలియమ్సన్ తరహాలో నిలకడగా పరుగులు చేయగలడు. ఇంకా చెబుతూ పోతే.. రిటైర్ అవకముందు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషీమ్ ఆమ్లానూ ఇలాగే పట్టించుకోలేదు. అంతెందుకు..? ఈ సీజన్ వేలంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూ ఇదే అనుభవం ఎదురైంది. స్మిత్ అద్భుతఫీల్డర్ కూడా.
అయినా అతడి ఫామ్ పెద్దగా ప్రభావవంతంగా లేదని పక్కనపెట్టాయి ఫ్రాంచైజీలు. అయితే, అంతే విచిత్రంగా ఆస్ట్రేలియా ప్రస్తుత టి20, వన్డే కెప్టెన్ అరోన్ ఫించ్ ను మాత్రం రూ.కోటిన్నర పెట్టి కొనుక్కుంది కోల్ కతా నైట్ రైడర్స్. ఇప్పటివరకు లీగ్ లో 87 మ్యాచ్ లు ఆడిన ఫించ్ 2వేలపైగా పరుగులు చేశాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే.. ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ బయో బబుల్ భయంతో లీగ్ ఆడనని చెప్పడంతో ఫించ్ కు అవకాశం దక్కింది.
విధ్వంసకారుడే.. కానీ, ఫించ్ దూకుడైన బ్యాట్స్ మనే. ఓపెనర్ గా ఎన్నో మ్యాచ్ ల్లో మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. బాల్ ట్యాంపరింగ్ కారణంగా స్మిత్ కెప్టెన్సీ పోవడంతో.. కాలం కలిసివచ్చి ఫించ్ ను కెప్టెన్సీ వరించింది. దీంతో నాలుగేళ్లుగా ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.
వాస్తవానికి ఫించ్ కొన్నేళ్లుగానే ఫామ్ లోనే లేడు. ఈ ప్రకారం చూస్తే కనీసం బ్యాట్స్ మన్ గానూ కంగారూ జట్టులో కొనసాగే అర్హత లేదు. కానీ, కెప్టెన్ కావడం.. మరో ప్రత్యామ్నాయం కొరవడి అతడిని కొనసాగిస్తున్నారు. లీగ్ లలో 349, అంతర్జాతీయ టి20ల్లో 89 మ్యాచ్ లు ఆడిన ఫించ్ అనుభవానికీ ఏమీ తక్కువ లేదు. 2011లోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 35 ఏళ్ల ఫించ్ ఆసీస్ టెస్టు జట్టులో మాత్రం సభ్యుడు కాలేకపోయాడు.
9 జట్లకు ఆడిన ఘనత ఫించ్ ఈ సారి కోక్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్నాడు. రూ.కోటిన్నరకు కొనుక్కున్న అతడిని శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా పంపింది. కాగా, ఐపీఎల్ లో ఇప్పటివరకు అంటే.. క్రితం సీజన్ వరకు 8 జట్లు ఉంటే.. వాటిలో ఆరు జట్లకు ఆడిన ఘనత అతడిది.
చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ కు మాత్రమే ఫించ్ ప్రాతినిధ్యం వహించలేదు. అయితే, చెన్పై పై నిషేధంపడిన సందర్భంలో పుణె సూపర్ జెయింట్స్ గా ఆ జట్టు బరిలో దిగింది. దానికి సైతం ఫించ్ ఆడాడు. ఇప్పుడు 9 వ జట్టు కోల్ కతా తరఫున క్రీజులో అడుగుపెట్టాడు.
అత్యధికం అతడి పేరిటే..
ఇప్పటివరకు లీగ్ లో అత్యధిక ఫ్రాంచైజీలకు ఆడిన ఆటగాడిగా ఫించ్ రికార్డు నెలకొల్పాడు. ఈ విషయంలో మిగతా క్రికెటర్లు ఇతడికి దరిదాపుల్లో లేరు. రెండో అత్యధికంగా చూస్తే.. దినేశ్ కార్తీక్, పార్థివ్ పటేల్, ఇషాంత్ శర్మ, మనీశ్ పాండే 6 జట్లకు ప్రాతినిధ్యం వహించారు.
ఫామ్ మాటేమిటో..? 35, 2, 8, 0, 67, 23, 0 ,0, 55,7 ..ఇవీ గత పది మ్యాచ్ ల్లో ఫించ్ స్కోర్లు. అత్యంత అధ్వాన ఫామ్ లో ఉన్న అతడిని కోల్ కతా శుక్రవారం హైదరాబాద్ తో మ్యాచ్ లో బరిలో దింపింది. కానీ, చేసింది ఏడు పరుగులే. దీన్నిబట్టి అతడు పరుగుల కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో తెలిసిపోతోంది.
అలాంటి ఫించ్ ను కొనుక్కున్న కోల్ కతా.. అతడిని ఇంగ్లండ్ బ్యాటర్ శామ్ బిల్లింగ్స్ బదులు దింపింది. బిల్లింగ్స్ ఫామ్ లో లేకున్నా.. మరీ ఫించ్ అంత కాదు. కానీ, చివరకు ఈ ప్రయోగమూ పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఫించ్ పరుగులు సాధించలేదు. చూద్దాం.. ఇకపైనైనా మరి రాణిస్తాడేమో?