అమెరికా ప్రతినిధుల సభకు మోడీ అభిమాని రాజీనామా

Update: 2015-03-20 09:58 GMT
భారత ప్రధాని మోడీని అమెరికాకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిన రిపబ్లికన్‌ పార్టీ నేత, అక్కడ లెజిస్లేటర్‌ అరోన్‌ షాక్‌ రాజీనామా చేశారు. మోడీకి అమెరికా వీసా నిరాకరించిన తరువాత మోడీ గుజరాత్‌సీఎంగా ఉన్న సమయంలో ఆయనతో భేటీఅయిన అమెరికా ప్రతినిధి బృందంలో అరోన్‌ ఉన్నారు. ఆయన అప్పట్లో మోడీకి అనుకూలంగా వ్యవహరించారు.. అంతేకాదు, మోడీ ప్రధాని అయిన తరువాత కూడా ఆయన పట్ల అమెరికాలో ఉన్న అభిప్రాయాన్ని తొలగించడానికి కృషి చేసినవారిలో అరోన్‌ ఒకరు... ఇప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో అమెరికా చట్టసభల్లో మోడీ తరఫున వాయిస్‌ తగ్గినట్లే.

    అరోన్‌ రాజీనామాకు కారణం పరోక్షంగా భారత్‌ కారణం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన గతంలో భారత్‌ పర్యటించినప్పుడు అక్కడ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనతో ఒక ఫోటోగ్రాఫర్‌ను తీసుకురావడం వివాదాస్పదమైంది. అంతేకాదు, రవాణా ఖర్చుల్లోనూ తేడాలు చూపించారట. ఈ ఆరోపనలు రావడంతో అరోన్‌ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అరోన్‌ ఇల్లినాయిస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అమెరికా చట్టసభల్లో మోడీకి అనుకూలించే ప్రతినిధి ఒకరు తగ్గినట్లయింది.

Tags:    

Similar News