ఆటోలో చ‌క్క‌ర్లు కొట్టిన డివిలియ‌ర్స్

Update: 2018-04-27 10:38 GMT
ఇప్పుడు దేశ వ్యాప్తంగా మ‌రోసారి ఐపీఎల్ ఫీవ‌ర్ ప‌ట్టేసింది. సాయంత్రం అయితే చాలు.. ఐపీఎల్ మ్యాచ్ కోసం టీవీ చాన‌ళ్లు మార్చేస్తున్నారు. మ్యాచ్ మ్యాచ్ కు ఐపీఎల్ క్రేజ్ అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.ఇదిలా ఉంటే.. ఐపీఎల్ టోర్నీలో ఆడేందుకువ‌చ్చిన విదేశీ ఆట‌గాళ్లు.. ఆయా న‌గ‌రాల్లో ప‌ర్య‌టిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా అలాంటి ప‌నే చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాడు డివిలియ‌ర్స్ వీడియో ఒక‌టి వైర‌ల్ గా మారింది.

బెంగ‌ళూరులో చెన్నైతో జ‌రిగిన మ్యాచ్ లో డివిలియ‌ర్స్  68 ప‌రుగులు చేసినప్ప‌టికి చెన్నై ఆట‌గాళ్లు రాయుడు.. ధోనీలు అద్భుతంగా రాణించ‌టంతో ఆ మ్యాచ్ లో ఓట‌మి త‌ప్ప‌లేదు. ఆట పూర్తి అయిన ప‌క్క‌రోజున త‌న భార్య‌.. పిల్ల‌ల్ని తీసుకొని ఒక ఆటోలో బెంగ‌ళూరు వీధుల్లో తిరిగాడు డివిలియ‌ర్స్.

అయితే.. అతన్ని గుర్తించిన బెంగ‌ళూరు యువ‌త‌.. త‌మ వాహ‌నాల‌తో ఆటోను ఫాలో అయ్యారు. ఈసారి క‌ప్పు మాదే అన్న నినాదాన్ని బెంగ‌ళూరు యువ‌త చేయ‌గా.. డివిలియ‌ర్స్ స‌తీమ‌ణి.. వారి పిల్ల‌లు కూడా అదే నినాదాన్ని చేయటం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆటోలో బెంగ‌ళూరు వీధుల్లో తిరిగిన వీడియోను డివిలియ‌ర్స్ త‌న సోష‌ల్ నెట్ వ‌ర్క్ ఖాతాలో షేర్ చేశారు. అదిప్పుడు వైర‌ల్ గా మారింది. ఈవీడియోను చూస్తే.. ఆట‌కు ఆట‌.. వినోదానికి వినోదం అన్నట్లుగా ఉండ‌టం క‌నిపిస్తుంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News