దేశంలోని ఎన్నారై వధువులపై పరిశోధన నిర్వహించేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కంకణం కట్టుకుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువకులు సొంత దేశానికి వచ్చి ఇక్కడి అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుంటున్న సంస్కృతి పెరిగిపోయింది. కానీ వాటిలో అన్ని బంధాలు విజయవంతం అవ్వడం లేదు. చాలా సందర్భాల్లో పెళ్లికొడుకులు అమ్మాయిలను ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు. అలా పెళ్లి చేసుకొని భార్యల్ని హింసిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. .
విదేశీ గణాంకాల మంత్రిత్వశాఖ చెప్పిన వివరాల ఆధారంగా ఎన్ ఆర్ ఐ మహిళల్ని వరకట్నం - భౌతిక దాడులు - అక్రమసంబంధాన్ని కొనసాగిస్తూ భార్యల్ని హింసిస్తున్న ఘటనలపై జనవరి 1 - 2015 నుండి నవంబరు 30 - 2017వరకు 3,328 మంది ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది.
దీన్ని అరికట్టేందుకు కేంద్రం కొన్ని సిఫార్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. ఎన్నారై ఆగడాలకు చెక్ పెట్టేలా పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయిన భార్యల సమస్యను దృష్టిలో ఉంచుకొని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (WCD) మంత్రి మేనకాగాంధీ - విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ - న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ లు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వివాహాలు రిజిస్ట్రేషన్ - ఎన్నారై మహిళలు - మరియు పిల్లలకు సంబంధించిన వివరాల్ని అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క వెబ్ సైట్లో ఉంచేలా చర్యలు తీసుకుంది. వీటితో పాటు ఎన్నారై మహిళలు ఆస్తి పంపకాల్లో భర్త ఆస్థినే కాకుండా ఇతర కుటుంబసభ్యుల ఆస్థుల్ని నష్టపరిహారం కింద జప్తు చేసుకునే వీలు కల్పించనుంది.
ఎన్ఆర్ఐ వివాహాలకు సంబంధించి ఫిర్యాదులను పరిశీలించేలా మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఎన్నారై మహిళల నుంచి ఫిర్యాదులు అందితే , కోర్టులు సంబంధిత కేసును వివారించి, దోషులైన ఎన్నారైల పాస్ పోర్టులను రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది.
జూన్ నెలలో - మహిళా - పిల్లల అభివృద్ధి - మహిళా వ్యవహారాల మంత్రిత్వశాఖ - విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ విదేశాలలో ఎన్నారై భర్తలను వదిలేసిన మహిళలకు సహాయపడేందుకు వెబ్ సైట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.