సన్యాసి.. సన్నాసి పని.. మత్తు మందిచ్చి బాలికలపై అత్యాచారాలు.. ఒకరు కాదు!
ఆయన సన్యాసి. అరిషడ్వర్గాలను త్యజించి.. దైవానికి మారు పేరుగా నిలవాల్సిన స్థానంలో ఉన్నారు. సర్వసంఘ పరిత్యాగం చేసి.. సన్యాసాశ్రమంలో బతుకుతున్నారు. కానీ, చాంచల్య బుద్ధినిమాత్రం మార్చుకోలేక పోయారు. సన్యాసిగా ఉండి సన్నాసి పనులు చేశారు. సభ్య సమాజం ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడి.. సన్యాసాశ్రమాన్ని భ్రష్టుపట్టించారు. ఆయనే శివమూర్తి మురుఘ!
కర్ణాటకలోని మఠాధిపతి శివమూర్తి మురుఘా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. కేవలం ఇద్దరిపైనే కాకుండా దాదాపు 15 మందికి పైగా బాలికలకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించినట్లు, అత్యాచారం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు శివమూర్తిపై ఛార్జిషీటు దాఖలు చేశారు.
మురుఘా మఠ్ వసతిగృహాల్లో ఉంటున్న బాలికలకు మత్తుమందులు ఇచ్చి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత లైంగికంగా హింసించేవారని పేర్కొన్నారు. ఇంకా బాధితులెవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు కోరారు.
స్వామీజీ శివమూర్తి 2019 నుంచి 2022 వరకు తమను లైంగికంగా వేధించినట్లు, పదే పదే అత్యాచారం చేసినట్టు ఇద్దరు బాలికలు ఆరోపించిన నేపథ్యంలో శివమూర్తి మురుఘాపై ఆగస్టు 26న మైసూరులో కేసు నమోదైన విషయం తెలిసిందే. అనంతరం కేసును చిత్రదుర్గ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆరోపణల తీవ్రత దృష్ట్యా శివమూర్తి శరణు, మురుఘా మఠం పాలనాధికారి, మరో ముగ్గురు సిబ్బందిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు పారిపోయే అవకాశాలున్న కారణంగా లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు.
బాధితుల తరఫున శిశు సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ), జాతీయ మానవ హక్కుల సమితి రంగ ప్రవేశం చేయటం, బాధితుల్లో ఒకరు దళిత వర్గానికి చెందిన వారు కావటంతో నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. కేసు చిత్రదుర్గ పోలీస్టేషన్‌కు బదిలీ అయిన తర్వాత సెప్టెంబరు 1న విచారణ పేరిట నిందితుడిని అరెస్టు చేసి అజ్ఞాతానికి తరలించారు.
ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారు. శివమూర్తి మురుఘకు దేశంలోని ప్రముఖులతో పరిచయాలు ఉండటంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆగస్టు నెలలోనే శివమూర్తి మురుఘ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శివదీక్ష స్వీకరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.