ఒక ప్రముఖ నటుడు.. సెలబ్రిటీ మాల్ లో కనిపిస్తే ఏం చేస్తాం? వెనుకా ముందు చూసుకోకుండా దూసుకెళ్లి.. సదరు సెలబ్రిటీని కలుసుకొని పరిచయం చేసుకొని సెల్ఫీ ప్లీజ్ అనటం.. ఫోటో తీసుకొని వెనువెంటనే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటం మామూలే. ఇలాంటివి ఎక్కడైనా కనిపిస్తాయి. కానీ.. ఇలాంటి పరిస్థితే ఒక నటుడుకి ఎదురైంది. అలవాటులో భాగంగా ఓకే చెప్పేశారు. అంతే.. సెల్ఫీల మీద సెల్ఫీలు దిగిన అతగాడికి అక్కడి పోలీసులు షాకిస్తూ.. అరెస్ట్ చేయటమే కాదు.. కేసు కూడా బుక్ చేశారు.
ఇలాంటి చిత్రమైన పరిస్థితి సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. అరబ్ దేశాల్లో చట్టాలు చాలా చిత్రంగా ఉంటాయన్న మాటకు తగ్గట్లే తాజాగా చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు చర్చగా మారింది. కువైట్ కు చెందిన ప్రముఖ నటుడు.. టీవీ యాంకర్ అయిన అబ్దుల్ అజీజ్ అల్ కస్సార్ సౌదీ అరేబియాకు వచ్చారు.
తాను పర్యటిస్తున్న రియాద్ నగరంలో ఏ మాల్ కు వెళితే బెటర్ అని సోషల్ మీడియాలో తన అభిమానుల్ని ప్రశ్నించారు. అత్యధికులు చెప్పినట్లే అల్ నకీల్ అనే మాల్ కి వెళ్లారు. అతగాడ్ని చూసిన వెంటనే లేడీ ఫ్యాన్స్ ఆయన చుట్టూ మూగిపోయారు. అతగాడితో సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. దేశం కాని దేశంలో ఇంతటి ఆదరణ లభిస్తే ఏ సెలబ్రిటీకి మాత్రం సంతోషం కలగదు. అందుకే ఆయన సెల్ఫీలకు ఓకే చెప్పేశాడు. అంతలోనే మాల్ భద్రతాధికారి ఒకరు వచ్చి అతగాడిని బలవంతంగా తీసుకెళ్లారు. జరుగుతున్నదేమిటో అతనికి అర్థం కాలేదు.
అలా మహిళలతో కలిసి సెల్ఫీలు దిగుతావా? అంటూ అతన్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో షాక్ తిన్న ఆయన మొత్తానికి కిందామీదా పడి తన గురించి చెప్పుకొని బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ సౌదీ చట్టాల ప్రకారం కేసు మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అభిమానులు అభిమానంతో సెల్ఫీలు దిగినా కేసే అంటే.. వామ్మో ఊహించుకోవటానికి కూడా కష్టంగా ఉంది కదూ.