గత మూడు రోజులుగా విషాదంతో కూరుకుపోయిన భారతావని.. ఇంకా అందులో నుంచి బయటకు రాలేదు. షిల్లాంగ్ నుంచి ఢిల్లీకి చేరిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థిపదేహం.. బుధవారం ఉదయం.. ఢిల్లీ నుంచి ఆయన సొంతగడ్డకు తరలిస్తున్నారు.
ఇందుకోసం పాలం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధురై కి కలాం పార్థిపదేహాన్ని తరలిస్తారు. తమిళనాడులోని మధురై నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కలాం పార్థిపదేహాన్ని రామేశ్వరానికి తరలిస్తారు.
రామేశ్వరం చేరిన తర్వాత.. రాత్రి ఏడు గంటల నుంచి ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. గురువారం ఉదయం 10.30 గంటలకు కలాం తుది సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ.. కేంద్రమంత్రులతో పాటు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.