ప్ర‌భుత్వానికి జ‌వాన్ కుటుంబం షాక్‌

Update: 2017-04-27 10:57 GMT
చ‌త్తీస్‌ గ‌ఢ్‌ లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు జ‌రిపిన దాడిలో మ‌ర‌ణించిన ఓ సీఆర్పీఎఫ్ జ‌వాను కుటుంబ స‌భ్యులు బీహార్ ప్ర‌భుత్వం ఇచ్చిన ప‌రిహారాన్ని నిరాక‌రించారు. ఈ దాడిలో ఆరుగురు బీహార్‌ కు చెందిన జ‌వాన్లు మృతి చెందారు. అందులో ఒక‌రు అభ‌య్‌ కుమార్‌. అంద‌రితోపాటు ఈ జ‌వాను కుటుంబ స‌భ్యుల‌కు కూడా బీహార్ ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌ల ప‌రిహారం ఇచ్చింది. అయితే అంత్య‌క్రియ‌ల సంద‌ర్భంగా ప‌రిహారం తాలూకు చెక్ తీసుకోవ‌డానికి ఆ కుటుంబం నిరాక‌రించింది.

``బీహార్ ప్ర‌భుత్వం ప‌రిహార చెక్‌ ను వ‌ద్ద‌న్నాం. ఈ పరిహారం గౌర‌వమా - అవ‌మాన‌మా. శ‌త్రువుల‌తో పోరాడి మ‌ర‌ణించిన వ్య‌క్తికి ఇచ్చే పరిహార‌మా ఇది?`` అని అభ‌య్ బంధువు ఒక‌రు ప్ర‌శ్నించారు. రోడ్డు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించిన వారికే రూ.4 ల‌క్ష‌లు ఇస్తున్న బీహార్ ప్ర‌భుత్వం.. ఓ అమ‌ర‌వీరుడికి ఇలాగేనా ప‌రిహారం ఇచ్చేద‌ని అభ‌య్ కుటుంబ స‌భ్యులు నిల‌దీస్తున్నారు. గ‌తేడాది ఉరి దాడిలో మ‌ర‌ణించిన జ‌వాను కుటుంబం కూడా రూ.5 ల‌క్ష‌ల ప‌రిహారం తీసుకోవ‌డానికి నిరాక‌రించిన విష‌యం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News