నిన్న దేశం మొత్తం అభినందన్ రాక కోసం ఆతృతగా ఎదురుచూసింది. ఆయన రాకతో సంబరాలు చేసుకుంది. మీడియా, సోషల్ మీడియా అంతా అభినందన్ గురించే చర్చ జరిగింది. కాగా సోషల్ మీడియాలో కొందరు కొంత మంది సైనికులు డ్యాన్సులు చేస్తున్న వీడియోలను తెగ షేర్లు చేస్తూ వైరల్ చేశారు.
‘భారత్ కు అభినందన్ ను అప్పగించే ముందు.. అభినందన్ పాకిస్తాన్ ఆర్మీతో కలిసి డ్యాన్స్ చేసినట్టు’ ఆ వీడియోలో చూపించారు. భారత పైలెట్ అభినందన్ పాక్ ఆర్మీతో డ్యాన్స్ చేయడం ఏంటని.. దీనిపై అందరూ ముక్కున వేలేసుకున్నారు. అయితే అభినందన్ వ్యక్తిత్వాన్ని , భారత్ ను దెబ్బతీయడానికే ఈ వీడియోను పాక్ రిలీజ్ చేసిందని సమాచారం.
నిన్నటి నుంచి వైరల్ అయిన వీడియోను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఫేక్ వీడియో అని అర్థమవుతుంది. అభినందన్ పోలికలున్నట్టు కనిపిస్తున్న వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలిస్తే అది మన అభినందన్ కాదన్న విషయం అర్థమవుతుంది. అభినందనే డ్యాన్స్ చేశాడంటూ చాలా మంది ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లలో షేర్ చేసి వైరల్ చేయడంతో దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
కొంత మంది అసలు వీడియోను చూపించి.. ఆ వీడియోను మార్ఫింగ్ చేసి అభినందన్ ముఖాన్ని అతికించారని నిరూపించారు. ఈ మేరకు అసలైన వీడియోను బయటకు తీశారు.అందులో ఒకటే పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపించడం విశేషం. దీన్ని బట్టి అభినందన్ పాకిస్తాన్ ఆర్మీతో కలిసి డ్యాన్స్ చేయలేదని నిర్ధారణ అయ్యింది.
ఈ నకిలీ వీడియో ఇరు దేశాల్లోనూ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉంది. దేశం కోసం పోరాడిన అభినందన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా.. అతడిపై చెడు అభిప్రాయం కలిగించేలా కొందరు కుట్ర చేశారని అర్థమవుతోంది. ఇలా ఫేక్ వీడియోల వల్ల ఇరు దేశాల్లోని సైనికుల ఔన్నత్యం దెబ్బతింటుందని.. దాన్ని షేర్ చేయవద్దని అధికారులు కోరుతున్నారు.
Full View