పాక్ తో ఘర్షణ వాతావరణానికి ముందు దేశ వ్యాప్తంగా మోడీ మీద వ్యతిరేక ప్రచారం జోరుగా సాగేది. మరికొద్ది రోజుల్లో విడుదలయ్యే ఎన్నికల నోటిఫికేషన్ మీద చర్చ జరగటంతో పాటు.. మోడీ వైఫల్యాల మీద భారీగా చర్చ జరిగేది. దీనికి కౌంటర్ గా మోడీ వర్గం చేసే వాదనలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేది.
పుల్వామా ఉగ్రదాడి.. తదనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన మెరుపుదాడులు.. తర్వాత అభినందన్ ఎపిసోడ్ ఇలా.. వరుస పరిణామాలతో ఇప్పుడు అందరూ మోడీని తిట్టటం.. ఆయన సర్కారుపై విమర్శలు చేయటం మానేసి.. అభినందన్ గురించి మాట్లాడుకోవటం ఎక్కువైంది. ట్రెండ్‌కు తగినట్లుగా వ్యవహరించటం ద్వారా జాతి జనుల మనసులు దోచుకోవాలనుకున్నారో లేదంటే ఆ అంశం చుట్టూనే మరింత చర్చ జరగాలని భావిస్తున్నారో ఏమో కానీ.. బీజేపీ నాయకత్వం అభినందన్ ధైర్య సాహసాల గురించి.. ఆయన దేశభక్తిని తెలిపేలా ప్రకటనలు చేస్తున్నారు.
తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అందులోని మీమ్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. పాక్ దళాల చేతికి చిక్కిన వేళలో అభినందన్ ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తు చేసేలా ఈ మీమ్ ఉంది. ఈ పోస్ట్ కు స్మృతి మేడమ్ వెడ్నెస్ డే విజ్డమ్ అంటూ ట్యాగ్ జత చేశారు.
ఇంతకూ ఆ మీమ్స్ లో ఏముందంటే.. ప్రస్తుతం నడుస్తున్న పరీక్షల నేపథ్యంలో ఆమె ఈ పోస్ట్ పోస్ట్ చేశారేమో? ఇద్దరు వ్యక్తులు కలిసి ఎగ్జామ్ రాస్తుంటారు. వారిలో గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి పాకిస్థానీ కాగా.. పింక్ టీ షర్ట్ ధరించిన వ్యక్తి అభినందన్. పాక్ ఏదో అడుగుతుండగా.. అభినందన్ వెనుక నుంచి ఒక కాగితాన్ని అందజేస్తాడు. ఆ కాగితాన్ని తెరిచి చూసిన పాక్ ఆశ్చర్యపోతుంది. అందులో.. ఇది నేను మీకు చెప్పకూడదని ఇంగ్లిషులో (i'm not supposed to tell you this) అని రాసి ఉంటుంది.
పాక్ దళాలకు చిక్కిన సందర్భంగా పలు ప్రశ్నలు వేసిన అధికారులకు బదులిచ్చే క్రమంలో అభినందన్ ఇదే మాటను పలుమార్లు చెప్పటం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో బహుళ ప్రాచుర్యం పొందిన వేళ.. ఆ విషయాన్ని గుర్తు తెచ్చేలా కేంద్రమంత్రి స్మృతి పోస్ట్ ఉందని చెప్పాలి.