ప్రత్యర్థులు తన యుద్ధ విమానాన్ని కూల్చివేసిన వేళ.. అందులో నుంచి తప్పించుకున్నప్పటికీ శత్రుసేనలకు చిక్కటానికి మించిన ఇబ్బంది మరొకటి ఉండదు. అలా చిక్కిన భారత వైమానిక దళ పైలెట్.. వింగ్ కమాండర్ అభినందన్ పూర్తిపేరు.. అభినందన్ వర్దమాన్. అతను అల్లా టప్పా పైలెట్ కాదు. సుశిక్షితుడైన పైలెట్. అతడి తండ్రి వెరో కాదు.. రిటైర్డ్ ఎయిర్ మార్షల్.. పరమ విశిష్ట సేవా మెడల్ గ్రహీత సింహకుట్టి వర్దమాన్ కుమారుడు.
తండ్రికి తగ్గట్లే కొడుకు సైతం ఎయిర్ ఫోర్స్ లో చేరారు. చెన్నై తాంబరం వైమానిక కేంద్రంలో కఠోర శిక్షణ పొంది మిగ్ యుద్ధ విమానాలు నడిపే సత్తా కలిగిన పైలెట్ గా గుర్తింపు పొందారు. ఇతడి శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే.. విమానాలతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు చేసే సూర్య కిరణ్ టీం ఉంది కదా. అందులో సభ్యుడు అతడు. 2004లో ఎయిర్ ఫోర్స్ లో చేరిన అతను అంచలంచెలుగా ఎదిగాడు.
గాల్లో విమానాల్ని గిరికీలు కొట్టిస్తూ విమానాన్ని అత్యంత నైపుణ్యంతో నడిపే ప్రతిభ అతడి సొంతం. అంతటి అనుభవం ఉంది కాబట్టే.. ప్రత్యర్థులు యుద్ధవిమానాన్ని కూల్చి వేసిన క్షణంలో.. తనను తాను కాపాడుకోగలిగాడు. ఆయన నడిపిన మిగ్ 21 బైసన్ కాలం చెల్లిన విమానంగా చెప్పక తప్పదు. ఈ ఏడాది చివరి నాటికి ఆ విమానాన్ని సర్వీసు నుంచి తొలగించనున్నారు. అలాంటి విమానంతోపాక్ విమానాల్ని వెంబడించటమంటే మాటలు కాదు. అలాంటి సూసైడ్ అటెంప్ట్ ను ఎలాంటి జంకు లేకుండా చేసిన సాహసం అతడి సొంతం. అయితే.. పాక్ బాంబులకు విమానం కూలిన వేళ అదృష్టం అతడి వెన్నంటి ఉంటూ అతని ప్రాణాల్నికాపాడుకునేలా చేస్తే.. దురదృష్టం తరుముకుంటూ వచ్చి పాక్ సేనలకు చిక్కేలా చేసింది.
ఇక.. అభినందన్ వర్దమాన్ తండ్రి వివరాల్లోకి వెళితే.. ఆయనెంత మొనగాడో తెలుస్తుంది
+ సింహకుట్టి స్వస్థలం తిరువణ్ణామలై జిల్లాలోని తిరుప్పన్నవూరు అనే చిన్న ఊరు.
+ కాంచీపురానికి 18 కి.మీ. దూరంలో ఉంటుంది.
+ తమిళనాడులోని అమరావతినగర్ సైనిక పాఠశాల పూర్వ విద్యార్థి.
+ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది.. 1973లో భారత వైమానిక దళంలో పైలట్‌గా చేరారు.
+ 40 రకాల విమానాలను 4 వేల గంటలు నడిపిన అనుభవం అతని సొంతం.
+ బెంగళూరులోని ‘ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్ మెంట్ లో ప్రధాన టెస్ట్ పైలట్ గా పని చేశారు.
+ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఫైటర్ ట్రైనింగ్ విభాగంలో చీఫ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నారు.
+ గ్వాలియర్‌లోని భారత వైమానికదళ బేస్‌లో పని చేసినప్పుడు మిరాజ్ 2000 ఆధునీకరణలో కీలక సభ్యుడు.
+ 2011 ఆగస్టు 1 నంచి 2012 నవంబరు 30 దాకా.. షిల్లాంగ్‌లో ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ ‘ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్’గా వ్యవహరించి రిటైరయ్యారు.
+ వైమానిక దళంలో ఆయన అందించిన సేవలకు.. అతి విశిష్ట సేవా పతకం.. వాయుసేన పతకం.. విశిష్ట సేవా పతకాలను సొంతం చేసుకున్నారు.