అభినందన్.. ఇప్పుడు ఈ పేరే ట్రెండింగ్.. పాక్ యుద్ధ విమానాలను వెంటాడి వేటాడి పాక్ భూభాగంలో కూలిపోయిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ ధైర్యసహాసాలకు దేశం మొత్తం ఫిదా అయ్యింది. శత్రువు దేశంలో ఉన్నా.. ముందే ఉన్నా కూడా చలించని ఆయన మనో నిబ్బరం, గుండె ధైర్యం చూసి దేశం సెల్యూట్ చేసింది. అభినందన్ దేశానికి తిరిగి రావాలని యావత్ దేశం ఎదురుచూసింది. యజ్ఞాలు, పూజలు చేసింది. మూడు రోజులుగా ‘అభినందన్ ’ నామ స్మరణతో దేశం మారుమోగిపోయింది.
ఎట్టకేలకు నిన్న రాత్రి 9.21 నిమిషాలకు పాకిస్తాన్ ఒత్తిడికి తలొగ్గి అభినందన్ ను భారత్ కు అప్పగించింది. అభినందన్ భారత్ లోకి అడుగుపెట్టగానే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.
అయితే ఇప్పుడు అభినందన్ మీసం పట్ల యువతలో క్రేజ్ ఏర్పడింది. దేశం గర్వించేలా చేసిన అభినందన్ మేనియా ఇప్పుడు జనాలను విపరీతంగా ఆకర్షిస్తోంది. యువత, పెద్దవాళ్లు ఆయన స్టైల్ ను అనుసరించేందుకు పోటీపడుతున్నారు. తమిళనాడుకు చెందిన అభినందన్ సంస్కృతి.. కట్టూ బొట్టూ ఫాలో అయిపోయేందుకు రెడీ అయిపోయారు.
అభినందన్ ధీరత్వానికి ప్రతీకగా ఆయన మీసం ‘గన్ స్లింగర్’ కనిపిస్తోంది. ఆయనలానే అందరూ మీసాలు పెంచుకొని తిప్పేందుకు సిద్ధమైపోయారు. ఇప్పుడీ అభినందన్‘గన్ స్లింగర్’ మీసం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది. తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్మాగ్ ట్విట్టర్ లో అభినందన్ వీరత్వంపై ప్రశంసలు కురిపించాడు. ‘మీ వల్లే మేమంతా నిశ్చింతగా .. గర్వంగా ఉండగలుగుతున్నాం.. మీకు శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు.
రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన జనరల్ అలెగ్జాండర్ షాలర్ ఇదే తరహా మీసం కలిగి ఉండి అసాధారణ పోరాట పటిమ చూపారు. ఈ జనరల్ కు అమెరికా ‘మోడల్ ఆఫ్ హానర్’ ను ఇచ్చి అత్యున్నత గౌరవం కట్టబెట్టింది. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా అభినందన్ కు మంచి పురస్కారంతో సత్కరించాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.