పాక్ యుద్ధ విమానాన్ని తరిమికొడుతూ పొరపాటున పాక్ భూభాగంలోకి ప్రవేశించిన యుద్ధ పైలెట్ విమానం కూలిపోవటం.. అందులో నుంచి బయటపడ్డ అభినందన్ వర్దన్ ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. కూలిన యుద్ధ విమానం నుంచి తప్పించుకున్న వింగ్ కమాండర్ ను పాక్ సైన్యం హింసించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చి కలకలం రేపుతోంది.
నిన్న ఆయనపై స్థానికులు కొందరు దాడి చేసిన వీడియో బయటకు రాగా.. తాజా వీడియోలో పాక్ సైన్యం హింసించినట్లు చెప్పే వీడియో బయటకు వచ్చింది. ఇందులో మాటలు అస్పష్టంగా వినిపిస్తుండటం.. ఆయన్ను వెనక్కు పడేసి.. దెబ్బలు కొట్టటం కారణంగా ముక్కుల్లో నుంచి రక్తం బయటకు వచ్చింది.
ఈ దృశ్యాలపై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. తాజాగా బయటకు వచ్చిన ఈ వీడియోలో మాటలు సరిగా వినిపించటం లేదు. తొలుత స్థానికులు.. తర్వాత సైన్యం హింసకు గురి చేసిందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటివరకూ అభినందన్ కు చెందిన నాలుగు వీడియోలు బయటకు వచ్చాయి.
ఒకదాంట్లో సెలయేరు లాంటి ప్రాంతంలో ఆయనపై దాడికి పాల్పడటం.. రెండో వీడియోలో ఆయన చేతులు వెనక్కి కట్టేసి.. కళ్లకు గంతలు కట్టి ప్రశ్నించటం.. మూడో వీడియోలో టీ కప్పుతో ఉన్న ఆయన టీ తాగుతూ ఉండగా.. పాక్ అధికారులు ఆయన నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేయటానికి సంబంధించిన వీడియోలు విడుదలయ్యాయి. తాజాగా.. పాక్ సైన్యం ఆయన్ను హింసించే వీడియో ఒకటి బయటకు వచ్చి కలకలం రేపుతోంది. అయితే.. మొదట చెప్పిన మూడు వీడియోల్లో మధ్యలోనిదా? అన్న ప్రశ్నకు సమాధానం లభించటం లేదు.
వీడియో కోసం క్లిక్ చేయండి