అభినంద‌న్ క‌మిట్ మెంట్ ఎంత ఎక్కువంటే..?

Update: 2019-03-04 04:55 GMT
శ‌త్రువు యుద్ధ విమానం అంతు చూడాల‌న్న ప‌ట్టుద‌ల అభినంద‌న్ లో ఎంత ఎక్కువ‌న్న విష‌యం అత‌డి సాహ‌సోపేత‌మైన చ‌ర్య ద్వారా ఇప్పుడు అంద‌రికి అర్థ‌మైంది. పాక్ చేతికి భార‌త పైలట్ చిక్కార‌న్నంత‌నే అంద‌రూ అనుకున్న దానికి.. త‌ర్వాత వెలుగు చూసిన విష‌యాల‌కు సంబంధ‌మే లేదు. భార‌త గ‌గ‌న‌త‌లంలోకి చొచ్చుకొచ్చిన పాక్ యుద్ధ విమ‌నాన్ని త‌రిమికొట్ట‌ట‌మే కాదు.. అత్యంత శ‌క్తివంత‌మైన ఎఫ్ -16 ను కూల్చి వేయ‌టం ఒక ఎత్తు అయితే.. ఆ క్ర‌మంలోత‌న యుద్ధ విమానం కూలిపోతున్న వేళ అందులో నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు అభినంద‌న్‌.
పాక్ చెర నుంచి భార‌త్ కు చేరిన ఆయ‌న‌కు గ‌డిచిన రెండున్న‌ర రోజులుగా వివిధ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

శుక్ర‌వారం రాత్రి తొమ్మిది గంట‌ల వేళ‌లో భార‌త్ లోకి అడుగు పెట్ట‌టం.. ఆ త‌ర్వాత కొద్ది గంట‌ల నుంచే అత‌డికి వివిధ ర‌కాలైన వైద్య ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అత‌డి శ‌రీరంలో ఎలాంటి స్పై బ‌గ్ లేద‌న్న విష‌యాన్ని వైద్యులు తేల్చారు. ఇదిలా ఉంటే.. వివిధ ప‌రీక్ష‌లు చేస్తున్న వేళ‌.. త‌న‌ను క‌లిసిన ఉన్న‌తాధికారుల‌ను అభినంద‌న్ ఒక కోరిక కోరిన‌ట్లుగా తెలుస్తోంది. ఆయ‌న కోరిక విని వారంతా ఆశ్చ‌ర్యానికి గురైన‌ట్లు చెబుతున్నారు.

ప్యారాచూట్ నుంచి కింద‌కు దిగే క్ర‌మంలో అభినంద‌న్ వెన్నుముక కింద భాగంలో గాయం కావ‌టంతో ఆయ‌న విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. అయితే.. తాను ఫిట్ గానే ఉన్నాన‌ని.. త‌న‌కు వైద్య‌ప‌రీక్ష‌ల్ని త్వ‌ర‌గా పూర్తి చేసి పంపితే తాను వెంట‌నే విధుల్లో చేరాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. తాను వెంట‌నే విధుల్లోకి చేరాల‌న్న అభినంద‌న్ కోరిక విన్న వైమానిక ద‌ళ అధికారులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యార‌ట‌.  అత‌డి క‌మిట్ మెంట్ కు ఇదో నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. అయితే.. బెంగ‌ళూరులోని ఐఏఎంలో నిర్వ‌హించే ప‌రీక్ష‌లో పాజిటివ్ ఫ‌లితం వ‌స్తే ఆయ‌న్ను పైల‌ట్ గా కొన‌సాగిస్తారు. ఈ విష‌మ ప‌రీక్ష‌ను ఆయ‌న ఎలా ఎదుర్కొంటారో చూడాలి.


Tags:    

Similar News