విదేశాల్లో భారతీయుల సత్తా.. ఈ ఏడాది ఎంత నగదు పంపారంటే?

Update: 2022-12-06 15:30 GMT
ఇటీవలి కాలంలో భారత్ కు విదేశీ సంస్థలు.. పెట్టుబడులు పెద్దఎత్తున తరలి వస్తున్నాయి. ఈ క్రమంలోనే 2030 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదగడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో భారత్ తయారీ హాబ్ మారబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.

భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలో విదేశీ భారతీయుల వాటా కూడా గణనీయంగా ఉందని తెలుస్తోంది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు పెద్ద మొత్తంలో నగదును ఇండియాకు పంపిస్తుండటంతో అది మన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కారణమవుతుంది. ఈ ఏడాది ప్రవాసీ భారతీయులు రికార్డు స్థాయిలో విదేశీ డబ్బులు ఇండియాకు పంపించినట్లు ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ రీసెర్చ్.. ప్రపంచ బ్యాంక్-2022 తాజా నివేదికల ప్రకారంగా ప్రవాసీ భారతీయులు ఈ ఏడాది ఏకంగా వంద బిలియన్ డాలర్లకు పైగా నగదును ఇండియాకు పంపించినట్లు వెల్లడైంది. విదేశాల్లో స్థిరపడిన వారి నుంచి పేద దేశాలకు డబ్బు బదిలీ అనేది ఒక స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటుంది. దీని వల్ల త్వరితగతిన ఆ దేశం వృద్ధి చెందే అవకాశం లభించనుంది.

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు విదేశాల నుంచి వచ్చే నగదు మరింతగా తోడ్పాటును అందించనుంది. దీని వల్ల భారత్ గ్రోత్ రేట్ మరింత పెరిగే అవకాశముంది. 2021లో భారతదేశం $89.4 బిలియన్లను రెమిటెన్స్‌లుగా పొందింది. 2022లో $100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. మన దేశ జీడీపీలో ఈ వాటా మూడు శాతంగా ఉండనుంది.

ప్రవాసీ భారతీయులు ఇటీవలి కాలంలో తక్కువ నైపుణ్యం కలిగిన సౌదీ అరేబియా.. గల్ప్ దేశాలతో పాటుగా ప్రస్తుతం బ్రిటన్.. అమెరికా.. సింగపూర్.. ఖతార్.. కువైట్ వంటి అధిక ఆదాయ దేశాల్లో వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరంతా కూడా భారత్ లోని తమ కుటుంబాలకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేస్తున్నారు.

అలా ఈ ఏడాదిలో ఏకంగా $100 బిలియన్ డాలర్లపైగా నగదు చెల్లింపు చేసినట్లు ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామం భారత్ కు మరింత మంచి చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నాయి. అయితే 2023లో అమెరికా.. బ్రిటన్ వంటి దేశాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ప్రపంచ వృద్ధి మందగించడం వంటి అంశాలు ప్రవాస భారతీయులకు పరీక్ష పెట్టే అవకాశముంది.
Tags:    

Similar News