ఇవాల్టి రోజున పత్రికను.. టీవీ ఛానల్ ను నడుపుతున్న ఒక అధినేత.. వారం చివరకు వచ్చేసరికి.. పెన్ను.. పేపరు పట్టుకొని రెండు.. మూడు గంటల పాటు తన ఛాంబర్లోకి ఎవరినీ అనుమతించొద్దంటూ సీరియస్ గా పొలిటికల్ విశ్లేషణ రాసేయటం సాధ్యమేనా?
ఒక విశ్లేషణ కోసం తాను ఖర్చు చేసే.. రెండు.. మూడు గంటల సమయాన్ని మరే ఇతర విషయాల కోసం వినియోగిస్తే.. మరింత అవుట్ ఫుట్ వస్తుందన్న విషయాన్ని పట్టించుకోకుండా ఉండటం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అలియాస్ ఆర్కేకే సాధ్యమవుతుందేమో. ఇవాల్టి రోజున చాలామంది పత్రికాధిపతులు తాము రాసినట్లుగా సంతకాలు పెట్టేసే మేటర్ ను తమ అస్థాన విద్వాంసుల చేత రాయించుకోవటం మామూలే. దీనికి జ్యోతి ఆర్కే మినహాయింపుగా చెప్పక తప్పదు.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మారిన టెక్నాలజీకి తగ్గట్లుగా కంప్యూటర్ మీద తెలుగులో టైపు కొట్టటం ఆర్కేకు రాదని చెబుతారు. అందుకే.. గుప్పెడు తెల్ల పేపర్లు తీసుకెళ్లి.. రాయటం మొదలు పెడతారని.. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాను రాసే విశ్లేషణలో ఒక్క కొట్టివేత.. దిద్దుబాటు ఉండదని చెబుతారు.
చాలా తక్కువ సమయాల్లోనే అన్వయ దోషాలు ఉంటాయే తప్పించి.. దాదాపుగా పొరపాటు దొర్లకుండా ఉండే పరిస్థితి ఉండదని చెబుతారు. తాజాగా తెలంగాణలో వేడెక్కిపోయిన రాజకీయం గురించి.. ఎన్నికల్లో కేసీఆర్ రాజకీయ వ్యూహం గురించి తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
ఒక మీడియా అధినేతగా ఆయన రాసిన దాన్లో నిజాలు ఎంత? అన్నది పక్కన పెడితే.. తన పేరు మీద సున్నిత అంశాల్ని రాసే ధోరణికి ఇప్పటి మీడియా అధినేతలు దూరంగా ఉంటున్న వేళ.. అందుకు భిన్నంగా జ్యోతి రాధాకృష్ణ మాత్రం ఇప్పటికి రాయటం అభినందించాల్సిన అంశంగా చెప్పక తప్పదు.
తాజాగా.. తెలంగాణ రాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎన్నికల వ్యూహాన్ని ఆర్కే తన విశ్లేషణలో చెప్పుకొచ్చారు. ఆయనేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే సంక్షిప్తంగా చూస్తే.. "పటిష్ఠ వ్యూహంతోనే కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. మహా కూటమిలో కాంగ్రెస్ పార్టీది పెద్దన్న పాత్ర అయినప్పటికీ తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు తనకూ - చంద్రబాబుకూ మధ్యే అన్న భావనను తెలంగాణ సమాజంలో వ్యాపింపజేయడమే కేసీఆర్ వ్యూహం. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకునే సరికి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కాకుండా చంద్రబాబు మాత్రమే కనపడేలా కేసీఆర్ పథకం పన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్న భావనను తెలంగాణ ప్రజలలో కలిగింపజేస్తే గెలుపు సులువు అవుతుందన్నది కేసీఆర్ అభిప్రాయంగా కనిపిస్తోంది" విషయాన్ని సింఫుల్ గా సూటిగా తేల్చేశారు.
తన వ్యూహాన్ని ఇంత ఓపెన్ గా చర్చించిన ఆర్కే తీరుతో.. కేసీఆర్ తన ప్లాన్ ఏమైనా మార్చుకుంటారా? లేదా.. అదే విధానాన్ని కంటిన్యూ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.