నలభయ్యేళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ లో వేమూరి రాధాకృష్ణతో ముఖాముఖిలో పాల్గొన్న చంద్రబాబు అనేక విషయాలు చెప్పారు. అసలు ఎన్టీఆర్‌ను ఎలా పాలిటిక్సులోకి లాక్కొచ్చారో.. కాంగ్రెస్ లో మంత్రిగా ఉంటూ సస్పెండ్ కావడం వంటి ఎన్నో కీలక అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడారు అనడం కంటే రాధాకృష్ణ ఒక్కటొక్కటిగా పాత కథలన్నీ గుర్తు చేస్తుంటే చంద్రబాబు ముసిముసిగా నవ్వుతూ అవన్నీ చెప్పుకొచ్చారనడం కరెక్టు.
ఈ క్రమంలో చంద్రబాబుపై ఆర్కే రెండుమూడు సార్లు సరదాగా కౌంటర్లేశారు. వాటిని చంద్రబాబు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ సమాధానాలిచ్చారు. చంద్రబాబు ఎన్టీఆర్ కుమార్తెను పెండ్లి చేసుకున్నప్పటి సందర్భాలను రాధాకృష్ణ గుర్తు చేయగా చంద్రబాబు అన్ని విషయాలు మాట్లాడారు. అలాగే తన పెళ్లి చిత్తూరు జల్లాలో సెన్సేషన్ అని చెప్పిన ఆయన జిల్లాలో ప్రతి ఇంటికీ శుభలేఖ ఇచ్చామన్నారు. దానికి ఆర్కే... ‘‘భోజనాలు ఆయన పెడతారు కదా..’’ అని చమత్కరించారు. దాంతో చంద్రబాబు కూడా నవ్వేశారు.
అలాగే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే అప్పటి సీఎం చెన్నారెడ్డిని కలిసి మంత్రి పదవి అడగడం వంటివన్నీ ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత చెన్నారెడ్డితో వివాదం, మళ్లీ చెన్నారెడ్డి తన సామర్థ్యాన్ని గుర్తించడం వంటివన్నీ చెప్పుకొచ్చారు.