ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం పాతిక వేలకు దగ్గరగా నమోదువుతున్నాయి. దీంతో.. ప్రభుత్వం నిబంధనలతో కూడిన కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారాలతోపాటు అన్ని కార్యకలాపాలకూ అనుమతి ఇచ్చింది. అయితే.. అనంతపురం అధికారులు మాత్రం ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు.
అనంతపురం జిల్లాలో కొత్తగా 2,975 కేసులు నమోదు కావడం కలకలం సృస్టించింది. ఈ సంఖ్యతో రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో అనంతపురం రెండో స్థానంలో నిలిచింది తూ.గో. జిల్లాలో ఏకంగా 3,383 కేసులు నమోదై, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీంతో అనంతపురం జిల్లాలో ఆదివారం పూర్తి లాక్ డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ జిల్లాలో కేసుల సంఖ్య ఇప్పటికే లక్ష దాటేసింది. ఇప్పటి వరకు లక్షా 10 వేల 860 కేసులు నమోదయ్యాయి. ఇందులో 94,240 మంది సంపూర్ణంగా కోలుకొని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం 15,852 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో.. కఠిన చర్యలకు దిగారు అధికారులు.
ప్రభుత్వం ప్రకటించిన ఆ 6 గంటల అవకాశం కూడా ఇవ్వకుండా పూర్తిగా అన్ని కార్యకలాపాలనూ నిలిపేశారు. మిగిలిన జిల్లాలతో పోల్చుకున్న అనంతపురంలో అత్యధిక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.