హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్ డీ విద్యార్థి రోహత్ వ్యవహారం రోజురోజుకి మరింత తీవ్రంగా మారుతోంది. తాజాగా ఈ అంశంపై ప్రధాని మోడీ కూడా దృష్టి సారించటం గమనార్హం. రోహిత్ ఆత్మహత్య ఎపిసోడ్ లో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అందులో ఒకటి ఏబీవీపీ నేత సుశీల్.. మరొకరు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. ఏబీవీపీ నేత సుశీల్ విషయానికి వస్తే.. తాజాగా ఒక మీడియా సంస్థతో టెలిఫోన్ ఇంటర్య్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రోహత్ తో మనస్పర్థలు.. గొడవ.. ఆత్మహత్య లాంటి అంశాలపై మాట్లాడారు. ఆయనేమన్నారంటే..
= ఏఎస్ ఏ పిటీషన్ హైకోర్టులో జనవరి 18న హియరింగ్ ఉంది. అంతకు ఒకరోజు ముందు రోహిత్ ఆత్మహత్య చేసుకోవటం బాధగా ఉంది. రోహిత్ ఆత్మహత్య కేసులో పారదర్శక విచారణ జరగాలి.
= రోహిత్ ఆత్మహత్యకు వామపక్ష వాదన ప్రొఫెసర్లు బాధ్యత వహించాలి. అతన్ని పూర్తిగా డిప్రెషన్ కు గురి చేసి.. ఆత్మహత్యకు కారణమయ్యారు.
= యాకూబ్ మెమన్ ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఏఎస్ ఏ నిరసన తెలిపింది. దాన్ని ఏబీవీపీ వ్యతిరేకించింది. దీన్లో భాగంగా పరిపాలనా భవనం వద్ద నిరసన చేశాం. ఆ సమయంలో వారితో మాటా మాటా జరిగింది. ఈ సందర్భంగా వారు అభ్యంతరకర నినాదాలు చేశారు. వారు చేసిన నినాదాలకు సంబంధించిన ఆధారాలు నా దగ్గరే ఉన్నాయి. ‘యాకూబ్.. నీ రక్తం నుంచి విప్లవం పుట్టుకు వస్తుంది’ అని వారు నినాదం చేశారు.
= ఇలాంటి నినాదాలు జాతి వ్యతిరేకం కాదా? వారి నినాదాలపై నిరసన తెలపాలన్న ఉద్దేశ్యంతో పోస్టర్లు వేశాం.
= యాకూబ్ మెమన్ ను సమర్థిస్తూ ఏఎస్ఏ చర్యల్ని నిరసించటానికి ప్రతిగా నా గది వద్దకు వచ్చి దాడి చేశారు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో వచ్చి దాడి చేశారు.
= ఈ సందర్భంగా నేను వాళ్లను గూండాలు అన్నందుకు బలవంతంగా క్షమాపణ లేఖ రాయించారు. ఆ సమయంలో ఏబీవీపీ నేతలతో మాట్లాడటానికి సమయం కోరా. అప్పుడు 100కు ఫోన్చేసి పోలీసులకు చెప్పా. పోలీసులు రాలేదు కానీ కాలేజ్ సెక్యూరిటీ వచ్చి గాయాలతో ఉన్న నన్ను జీపులో తీసుకెళ్లారు.
=తీవ్రంగా కొట్టటంతో తప్పనిసరి పరిస్థతుల్లో క్షమాపణ లేఖ రాశా. ఆ సమయంలో అలా రాయక తప్పలేదు.
= తనపై దాడి విషయాన్ని ఏబీవీపీ వర్సిటీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదుచేసింది. ఆసుపత్రిలో నేను ఉండిపోవటంతో మావాళ్లు దాడికి సంబంధించి సరైన సాక్ష్యాలు ఇవ్వలేదు. దాడి చేసిన వారిపై సరైన చర్యలు తీసుకోలేదని ఏబీవీపీ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసింది. అదే సమయంలో ఏఎస్ఏ కూడా ఓ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేసింది.
= ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదు. ఏబీవీపీ విన్నపాన్ని దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల శాఖకు ఫార్వర్డ్ చేశారంతే.
= వర్సటీలో కొందరు ప్రొఫెసర్లు నక్సలిజం చెబుతున్నారు. దీనిపై ఏబీవీపీ దృష్టి సారించింది. రెండేళ్ల క్రితం పృధ్వీ అనే విద్యార్థి మావో అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయని అరెస్ట్ అయ్యారు.