తహసీల్దార్ విజయారెడ్డి మృతి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఆరోపించినట్టు రెవెన్యూ శాఖలో అవినీతి కారణంగా తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు దారితీసిందా లేక అమాయకురాలిని భూవివాదంలో పొట్టున పెట్టుకున్నారన్న రెండు వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పాజిటివ్ గా నెగెటివ్ గా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే రెవెన్యూశాఖలో ఎన్నాళ్ల నుంచో గూడుకట్టుకున్న అవినీతి, నిర్లక్ష్యం తహసీల్లార్ విజయారెడ్డి హత్య తర్వాత తెలుగురాష్ట్రాల్లో మరింత వెలుగులోకి వస్తుందనే చెప్పాలి. తాజాగా తనకు పట్టదారు పాసుపుస్తకం ఇవ్వలేదని ఓ యువరైతు మంచిర్యాల తహసీల్దార్ ఆఫీసుకు పెట్రోల్ బాటిల్ తో వచ్చి పోసుకొని చస్తాను అంటూ బెదిరించడం కలకలం రేపింది. ఇక అది మరిచిపోకముందే శ్రీకాకుళం జిల్లా అముదాలవలసలో 70 మంది రైతులు పాల్గొని తమకు రైతు భరోసాను రెవెన్యూ అధికారులు ఇవ్వడం లేదని ఇలా తిప్పించుకోవడం వల్లే అధికారులపై దాడులు చేస్తున్నారని రైతులు తహసీల్లార్ ను కొట్టడానికి ప్రయత్నించడం హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.
రెవెన్యూశాఖలో అవినీతిపై ప్రజలు, రైతుల్లో ఇంత వ్యతిరేకత అధికారులపై వ్యక్తమవుతున్నా కూడా అధికారుల తీరు మారకపోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
తాజాగా కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ ఏసీబీ వలలో చిక్కింది. 4 లక్షల రూపాయలు లంచం హసన్ బీ సోదరుడు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. సురేష్ అనే రైతు కు చెందిన భూమి వివాదాన్ని ఆన్ లైన్ లో పరిష్కరించడానికి తహసీల్దార్ హసన్ బీ ఏకంగా 8 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. రైతు అంత ఇచ్చుకోలేనని.. 4 లక్షలకు బేరం కుదుర్చుకొని ఇస్తుండగా దొరికిపోయారు.
ఇక ఏపీలో ఇటీవలే కోట్లు కూడబెట్టిన ప్లానింగ్ అధికారి వ్యవహారం కలకలం రేపింది. విజయవాడ నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీవో) బాలగౌని మురళీగౌడ్ ఏకంగా సుమారు 100 కోట్ల అవినీతి ఆస్తులను కూడబెట్టిన వైనం విస్తుగొలిపింది. ఏసీబీ అధికారులు ఆయన ఆస్తులపై దాడులు చేసి అరెస్ట్ చేశారు.
ఇలా ఏపీలో పారదర్శక, అవినీతి లేని పాలన అందించడానికి సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అవినీతికి అంకితమైన కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. తెలంగాణలో తహసీల్లార్ విజయారెడ్డి ఘటనతోనైనా అధికారులు మారాలని ప్రజలు కోరుతున్నారు.