పి ఎస్ ఆర్ ఆంజనేయులు ...ఇప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనం. తప్పుచేసినవాడు తమ్ముడైన సరే తలనరికే తత్త్వం ఈయన సొంతం. ఆ నిజాయితీనే నేడు ఆయనకి ఇంతటి గొప్ప కీర్తి ప్రతిష్టతలు తెచ్చిపెట్టింది. వెన్నుచూపని ప్రభుత్వం అధికారిగా ..పని చేసిన శాఖలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకున్నారు. ఈయన గతంలో రవాణాశాఖ కమిషనర్ గా పనిచేసారు. ఆ సమయంలోనే తనదైన దూకుడుతో తప్పుచేసిన వారి తాట తీస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ దందాపై ఉక్కుపాదం మోపారు. రాజకీయ , సామజిక పలుకుబడి ఈయన ముందు దేనికి పనికిరావు అని నిరూపించారు. ఇదే సమయం లో రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్ ..ఈయన పనితీరు , ఎవరికీ లొంగని తత్త్వం నచ్చి పి ఎస్ ఆర్ ఆంజనేయులు ని ఏసీబీ చీఫ్ గా నియమించారు.
సీఎం జగన్ ఏ నమ్మకం అయితే , అయన మీద పెట్టుకొని రాష్ట్రంలో అవినీతిని అంతమొందించడానికి అత్యంత కీలకమైన ఏసీబీ కి ట్రాన్సఫర్ ఇప్పించారో ...ఏసీబీ డీజీ గా జాయిన్ అయిన తోలి వారంలోనే రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి అవినీతి ఉద్యోగుల్లో భయం నెలకొల్పారు. అలాగే సీఎం తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. తాజాగా రెవెన్యూశాఖపై వస్తున్న ఫిర్యాదులు, అవినీతి పై సీరియస్ అయ్యారు. ఏపీ రెవెన్యూ శాఖ అవినీతితో భ్రష్టుపట్టిందని భావించి దాన్ని పారద్రోలడానికి పూనుకున్నారు.
ఈ నేపథ్యంలోనే నేటి ఉదయం (మంగళవారం) నుండి 25 బృందాలుగా విడిపోయిన ఏసీబీ ... అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తుంది. శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురంకి చెందిన ఐటిడిఎ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ టి. మోహన్ రావు ఇంట్లో , అలాగే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, సూపర్నెంట్ శ్రీ గంధం వెంకట పల్లం రాజు ఇంట్లో , విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామము పి.ఎ.సిఎస్ స్టాఫ్ అసిస్టెంట్ శ్రీ సీరం రెడ్డి గోవిందు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా , కాకినాడ సీఈవో ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శ్రీ లంకె రఘు బాబు ఇంట్లో , కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్, పి. ఎ. టు స్పెషల్ కలెక్టర్ శ్రీశైలం ప్రాజెక్ట్, శ్రీ సాకే సత్యం ఇంట్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తుంది. వారి ఇళ్లల్లోనే కాకా , బంధువుల, బినామీల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా నగదు , బంగారం ,ఆస్త్లులు గురించారు. మొత్తంగా ఏసీబీ డీజీగా ఛార్జ్ తీసుకున్న నెల్ రోజుల వ్యవధిలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ పై వరుస దాడులు చేస్తూ అవినీతి ని అధికారుల పైన దండయాత్ర చేస్తూ ..అవినీతి అధికారుల గుండెల్లో నిద్ర పోతున్నారు.