మందుల స్కాం.. 300 కోట్లు కొల్లగొట్టారు!

Update: 2019-09-26 15:21 GMT
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 300 కోట్ల స్కాం.. అదీ తెలంగాణ నడి బొడ్డున.. ఇంత వరకూ ఏసీబీ రైడ్స్ లో ఇంత పెద్ద అవినీతి వెలుగుచూడలేదట. రోగులకు మందుల పేరిట బిల్లులు అధికంగా చూపి ఏకంగా 300 కోట్ల మందుల స్కాం చేసిన విషయం వెలుగుచూసింది..

తెలంగాణ ఈఎస్ ఐలో భారీ స్కాం వెలుగుచూసింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి మందులు - వైద్య పరికరాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెలుగుచూసింది.

ఈఎస్ఐ.. అంటే కార్మికులు - ఉద్యోగులకు వైద్యసాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వైద్యశాలలు. ఇందులో నిర్వహణ - వైద్య సదుపాయాలు అంతగా లేకపోవడంతో ఎవరూ వెళ్లడానికి ఆసక్తి చూపరు. అయితే అవసరం లేకపోయినా.. రోగులు చేరకపోయినా రూ.300 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేయడంతోపాటు రూ.10వేల మందులకు గాను లక్ష రూపాయలకు క్లెయిమ్ చేసి దోపిడీ చేసినట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది.

బినామీ పేర్లతో అర్హత లేని ఏజెన్సీల ద్వారా మందులను కొనుగోలు చేసి దాదాపు 300 కోట్ల స్కాంను ఈఎస్ ఐ డైరెక్టర్ దేవికారాణి చేసినట్టు తేలింది. ఈ పెద్ద స్కాంలో దేవికరాణితోపాటు అందులో కీలక అధికారులు - సిబ్బంది 23మంది ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇటీవల కాలంలో ఏసీబీ పట్టుకున్న అతిపెద్ద స్కాం ఇదేనని ఏసీబీ అధికారులు తెలిపారు.
   

Tags:    

Similar News