ఓటుకు నోటు కేసులో నిందితుడైన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారా? ఈ కేసు విచారణ కోసం సోమవారం ఏసీబీ ముందు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం బెయిల్ మీద కొడంగల్ లో ఉన్న ఆయన.. తాను బెయిల్ లో కోర్టు ప్రస్తావించిన అంశాల ప్రకారం విచారణకు హైదరాబాద్‌కు రాలేనంటూ ఏసీబీ కోర్టుకు సమాచారం అందించారు.
దీనిపై ఏసీబీ కోర్టు స్పందిస్తూ.. బెయిల్ లో పేర్కొన్న విధంగా కొడంగల్ దాటి రాకూడదన్న విషయంలో.. కోర్టు విచారణకు హాజరు కావొచ్చని ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. ఈ కేసును ఆగస్టు 3కు వాయిదా వేసిన కోర్టు.. తదుపరి విచారణకు కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి కోర్టుకు హాజరయ్యే విషయంలో రాలేని రేవంత్.. ఆగస్టు 3 విచారణకు మాత్రం హైదరాబాద్‌కు రాక తప్పదని చెబుతున్నారు. మరి.. మధ్యలో ఇంకేమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయేమో చూడాలి.