టీ సెక్రెటేరియట్లో కలకలం..

Update: 2019-02-13 05:13 GMT
అదేమీ జిల్లా, మండలాఫీస్ కాదు.. రాష్ట్ర పరిపాలనకు మూల కేంద్రమైన సెక్రెటేరియట్.. అలాంటి చోట కూడా లంచావతారులు విచ్చలవిడిగా డబ్బులు డిమాండ్ చేయడం విస్మయపరుస్తోంది. చేతులు తడపనిదే ఏ పనికాని పరిస్థితి తెలంగాణ సచివాలయంలో కొందరు అవినీతి అధికారుల వల్ల దాపురిస్తోంది. తాజాగా ఓ మహిళ ధైర్యం చేసి ఓ అవినీతి జలగను ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది.

ఖమ్మం జిల్లాకు చెందిన నాగలక్ష్మి అనే మహిళ భర్త ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ చనిపోయాడు. దీంతో తనకు కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే నాగలక్ష్మికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అందుకు రూ.1.20 లక్షలు ఇవ్వాలని సచివాలయంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ సెక్షన్ ఆఫీసర్ నాగరాజు డిమాండ్ చేశారు.

దీంతో విస్తుపోయిన నాగలక్ష్మి తను అంత మొత్తం ఇచ్చుకోలేని ప్రాధేయపడింది. కానీ అధికారి నాగరాజు ఒప్పుకోలేదు. దీంతో విసిగిపోయిన నాగలక్ష్మి ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారు పక్కా ప్లాన్ వేసి రూ. 60 వేలను ఇప్పించేందుకు రెడీ అయ్యారు.

ఎంజీబీఎస్ వద్ద నాగలక్ష్మి రూ.60వేలు లంచం అధికారి నాగరాజు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇలా ఓ సచివాలయ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కడం.. అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News