''బ్రహ్మదేవుడు దిగి వచ్చినా నిన్ను రక్షించలేడు చంద్రబాబు'' అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్లిక్ మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యకు అసలు అర్థం చెప్పేలా అడుగులు వడివడిగా పడుతున్నాయా? అంటూ అవుననే వాదన వినిపిస్తోంది.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవటమే కాదు.. పక్కా ఆధారాలతో చిక్కుకున్న నేపథ్యంలో.. తన రాజకీయ ప్రత్యర్థిని ఎంతమాత్రం విడిచి పెట్టకూడదన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇద్దరి చంద్రుళ్ల మధ్య ఒప్పందం కుదిరిందని చెబుతున్న దానికి భిన్నంగా ఏసీబీ.. ఓటుకు నోటు కేసు విషయంలో మేగంగా అడుగులు వేయటం కనిపిస్తుంది.
ఏసీబీ తీరు చూసినప్పుడు ఇద్దరి చంద్రుళ్ల మధ్య సయోధ్య జరిగినట్లుగా కనిపించదు. మొదట రేవంత్‌రెడ్డి తదితరుల్ని అదుపులోకి తీసుకున్నప్పుడు విచారించిన ఏసీబీ.. అంతిమ లక్ష్యం ''బాస్'' అన్నట్లే సాగింది. అయితే.. ఇందుకోసం తాము వెళుతున్న దారి సరిగా లేదని.. ఇలాంటి వాటితో బాస్‌ను బయటకు తేలమన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఏసీబీ ఇప్పుడు రూటు మార్చింది.
స్టీఫెన్‌సన్ మాత్రమే కాదు.. తెలంగాణ సర్కారును కూల్చేందుకు బాస్ మంత్రాంగం నడిపారన్నది నిరూపించేలా ఆధారాల కోసం ఏసీబీ ప్రయత్నిస్తోంది. గత కొద్ది రోజులుగా ఆ దిశగానే విచారణ సాగుతోందని చెబుతున్నారు. దీనికి నిదర్శనమే సండ్రకు ఇచ్చిన నోటీసుల్లో సెక్షన్ మార్చటంగా చెబుతున్నారు.
తాజాగా సండ్రను విచారించిన ఏసీబీ.. తమ ఛార్జ్‌షీట్‌లో సండ్ర కాల్‌డేటాకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా పేర్కొనటంతో పాటు.. ఆ వివరాల్ని సైతం పొందుపర్చటం ద్వారా.. బాస్ విస్తృతి చాలా ఎక్కువన్న విషయాన్ని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఓటుకు నోటు వ్యవహారానికి మించి.. తెలంగాణ రాష్ట్ర సర్కారును అస్థిరపరిచే కుట్రకు బాస్ కర్త.. కర్మ.. క్రియ అన్నది నిరూపించటమే లక్షమన్నట్లుగా ఏసీబీ తీరు ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.