ఏపీ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు తెరమీదికి వస్తున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న.. అసెంబ్లీ బీఏసీ మీటింగ్‌లో తాను గతంలో గవర్నర్‌ను అవమానించినట్టు నిరూపిస్తే.. ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని.. సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు.
ఇది మరువక ముందే.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మరో సంచలన కామెంట్లు చేశారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, నగరి శాసన సభ్యురాలు.. తన పదవికి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి.. గెలిస్తే.. తాము పోటీకి దూరంగా ఉంటామని.. ఆయన వ్యాఖ్యానించారు.
ఎందుకు అన్నారంటే..
అచ్చెన్నాయుడు ఎందుకు అంత సీరియస్ కామెంట్ చేశారంటే.. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కుని.. వైసీపీ ఎమ్మెల్యే రోజా.. టీడీపీపైనా.. అచ్చెన్నాయుడు, చంద్రబాబుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలు జై జగన్ అంటే నారావారి గుండెల్లో రీసౌండ్ రావాలి అని రోజా అన్నారు.
రాష్ట్రంలో మహిళ నేడు ఆత్మాభిమానంతో జీవిస్తోందన్నారు. సీఎం జగన్ నేడు మహిళా సాధికారతకు అవకాశం కల్పించారన్నారు. తన 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ రోజు ఆనందంగా మాట్లాడుతున్నానన్నారు. లోకేష్ ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో మహిళలతో డేన్స్ లేశారు. లోకేష్ పీఏ మహిళలను హెరాస్ చేశారు. దేవినేని ఉమ తన పదవి కోసం వదినని చంపారు. బోండా ఉమ తల్లిని కొట్టాడు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మహిళను బూటు కాలితో తన్నాడు. అని వ్యాఖ్యానించారు.
దీనికి కౌంటర్‌గానే..
రోజా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే అచ్చెన్న.. పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. రోజా కనుక ఇప్పుడు రాజీనామా చేసిన ఉప ఎన్నికలో గెలిస్తే.. తాము రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పారు.
మహిళా దినోత్సవం రోజున వైసీపీ నేతలు ఒక మహిళ మంగళసూత్రాన్ని తెంచేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులైన వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. వైసీపీ గూండాలకు పోలీసులు రక్షకులుగా మారారని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.