అచ్చెన్న లాజిక్ లో అర్ధముందా ?

Update: 2022-07-31 05:43 GMT
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విచిత్రమైన లాజిక్ వినిపిస్తున్నారు. ప్రభుత్వం మీద ఏదో బురదచల్లేయాలన్న ఆతృతతో తాను ఏమి మాట్లాడుతున్నారో కూడా చూసుకోవటం లేదు. కోవిడ్ మరణాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం 14733గా చెప్పిందట. తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఏపీలో మరణించిన వారి సంఖ్య 47,288గా చెప్పిందట. రెండు ప్రభుత్వాలు చెప్పిన మరణాల సంఖ్యలో ఏది కరెక్టు? అని నిలదీశారు. అలాగే మరణాల సంఖ్యను ఎక్కువగా చూపించి బులుగు పార్టీ వందల కోట్ల రూపాయలను స్వాహా చేశారంటు మండిపోయారు.

ఇక్కడే అచ్చెన్న లాజిక్ మిస్సవుతున్నారు. మరణాల సంఖ్యను తక్కువ చూపితే ఎక్కువ నిధులు స్వాహా చేయచ్చా ? లేకపోతే ఎక్కువ చూపిస్తే నిధులు స్వాహా చేయచ్చా ? మరణాల సంఖ్యను ఎక్కువగా చూపితేనే కదా ఎక్కువ నిధులు స్వాహా చేసే అవకాశం దక్కేది ? మరణాల సంఖ్యను తక్కువగా చూపి ఎక్కువ నిధులను స్వాహా చేయటం ఎలా సాధ్యమవుతుందో అచ్చెన్నే చెప్పాలి. ఎక్కడైనా చేయనిపని చేసినట్లు, జరగని పనులు జరిగినట్లు చూపించి డబ్బులు కాజేశారని ఆరోపిస్తుంటారు.

ఇక మరణాల సంఖ్యను తక్కువగా చూపటంపైన కూడా అచ్చెన్న ఆరోపణలు చేశారు. కరోనా అనేది యావత్ ప్రపంచాన్ని నెలల తరబడి టెన్షన్ పెట్టేసింది. ఒకళ్ళతో మరొకళ్ళు మాట్లాడటానికి కూడా భయపడిపోయారు. ఇంటికి పాలవాడు, కూరలవాళ్ళు వచ్చినా దగ్గరకు వెళ్ళటానికి భయపడిన రోజులున్నాయి. అలాంటపుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళల్లో చాలామంది కరోనాతో చనిపోయారంటే ప్రతి ఒక్కళ్ళల్లోను టెన్షన్ పెరిగిపోవటం ఖాయం. జనాల్లో ఆ ప్యానిక్ సిట్యుయేషన్ పెరగకూడదనే ప్రతీ ప్రభుత్వం మరణాలను తక్కువగా చూపించింది.  కరోనా సోకిందనే ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా చాలామందున్నారు.

కోవిడ్ మరణాలంటే ఏదో తుపానో లేకపోతే వరదల మృతులో కాదు. కరోనా సోకిన వ్యక్తి నుంచి పదుల సంఖ్యలో జనాలకు వ్యాపించి టెన్షన్ పెరిగిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. అందుకనే ముందు జాగ్రత్తగా కరోనా మరణాలను ప్రభుత్వం తక్కువగా చూపించింది. ఏపీ ప్రభుత్వమే కాదు దేశంలోని అన్ని ప్రభుత్వాలు ఇలాగే చేశాయి. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా కోవిడ్ మరణాలను తగ్గించే చూపింది. ఇందులో ప్రభుత్వం జనాలను మోసంచేసిందేమిటో  అర్ధం కావట్లేదు.
Tags:    

Similar News