నవ్యాంధ్ర నుంచి మరో వర్సిటీ కార్యకలాపాలు

Update: 2015-07-16 11:50 GMT
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం గుంటూరులోని లాం నుంచి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ వర్సిటీ తెలంగాణకు పోవడం.. దాని పేరును కూడా మార్చిన విషయం తెలిసిందే. దాంతో దీనిని ఇప్పుడు నవ్యాంధ్రలోని లాంలో వర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వర్సిటీ వీసీ క్యాంపు కార్యాలయం ప్రారంభమైంది.

వర్సిటీ వీసీ క్యాంపు కార్యాలయం ప్రారంభం కావడంతో వర్సిటీ కార్యకలాపాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. తొలిసారిగా అగ్రికల్చర్ డిప్లమో కోర్సుల కౌన్సెలింగ్ ను లాం నుంచి ప్రారంభించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు. ఆ తర్వాత మిగిలిన విభాగాలను అధికార యంత్రాంగాన్ని కూడా దశల వారీగా తీసుకు రావాలని భావిస్తున్నారు. అన్నటికంటే ముఖ్యంగా ప్రజలు ఒక భావనను తీసుకు రావడానికి అన్ని కార్యకలాపాలను ఇక్కడి నుంచే ప్రారంభించాలని వీసీ భావిస్తున్నారు. క్యాంపు కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. వర్సిటీ రిజిస్ట్రార్, డైరెక్టర్ ఆఫ్ రిసెర్చి, డైరెక్టర్ ఆఫ్ ఎక్సెటెన్షన్ వంటి కీలకమైన అధికారులు ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నా లాం నుంచి కూడా కార్యకలాపాలు నిర్వహించేలా ప్రయత్నిస్తున్నారు. అంతేనా.. వర్సిటీ ప్రకటనలను ఇక్కడి నుంచే జారీ చేయాలని నిర్ణయించారు. వివిధ కోర్సుల కౌన్సెలింగ్ తదితరానూ ఇక్కడి నుంచే చేపట్టాలని భావిస్తున్నారు.
Tags:    

Similar News