కేరళ మహిళా యాక్టివిస్టు రెహానా ఫాతిమా తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎప్పుడూ ఎదో ఒక వివాదాస్పదమైనవి పోస్ట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు రెహానా ఫాతిమా. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి శబరిమల ఆలయం లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తరువాత రెహానా ఫాతిమామరింత ప్రాచుర్యం పొందింది. అప్పట్లో హిందూవులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులకు 18 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు.
తాజా మంచం మీద అర్ధనగ్నంగా పడుకున్న సమయంలో ఆమె పిల్లలు ఆమె శరీరంపై ఆర్ట్ గీస్తూ తీసిన వీడియో షేర్ చేశారు. 'బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్’ పేరిట పోస్టు చేసిన సదరు వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది. ‘కంటి సమస్యతో బాధపడుతున్న తల్లి విశ్రాంతి తీసుకుంటుంటే.. ఆమె పిల్లలు ఫోనిక్స్ బర్డ్ చిత్రం వేసి కూల్ చేశారు’ అంటూ వీడియోకు ఫాతిమా కామెంట్ ను జోడించారు. దీని పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది.
ఈ వీడియోను చూసిన తిరువల్లాకు చెందిన న్యాయవాది అరుణ్ ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటి చట్టంలోని సెక్షన్ 67 (ఎలక్ట్రానిక్ ద్వారా లైంగిక అసభ్యకరమైన విషయాలను ప్రసారం), జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 (పిల్లల పట్ల క్రూరత్వానికి శిక్ష) కింద కేసు నమోదు చేశారు. చిన్నపిల్లలతో అర్థ నగ్నం గా పెయింటింగ్స్ వేయించుకున్నందుకు తిరువల్ల స్టేషన్ పోలీసులు ఫాతిమా పై కేసు నమోదు చేశారు. ‘వీడియోను ఎలా, ఎందుకు పోస్టు చేశారన్న దానిపై విచారిస్తున్నాం’ అని స్టేషన్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.