వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తారో చూస్తాం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకి కార్య‌క‌ర్త‌ల షాక్!

Update: 2022-08-14 08:32 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్సీపీ చేప‌ట్టిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఎమ్మెల్యేల‌కు చుక్క‌లు చూపిస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్ల‌లో ప్ర‌భుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివ‌రిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రాసిన లేఖ‌ను కూడా ప్ర‌జ‌ల చేతుల్లో పెడుతున్నారు. అయితే చాలా చోట్ల త‌మ‌కు వివిధ సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని, ల‌బ్ధిదారుల జాబితాలో త‌మ పేరు లేద‌ని.. ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే తిష్ట వేశాయ‌ని.. గెలిచిన మూడేళ్ల త‌ర్వాత తాము గుర్తొచ్చామా అని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

కాగా ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న‌లే కాకుండా సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల నుంచే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌కు చిక్కులు ఎదుర‌వుతున్నాయి. గ్రామాల్లో తాము చేసిన అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి బిల్లులు రావ‌డం లేద‌ని నేత‌లు నిల‌దీస్తున్నట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంలో ప‌లువురు ఎమ్మెల్యేల‌ను నేత‌లు నిల‌దీశారు. అప్పుల పాలయ్యామ‌ని.. త‌మ‌కు బిల్లులు ఇవ్వ‌కుంటే ఆత్మ‌హ‌త్య శ‌ర‌ణ్య‌మ‌ని వాపోతున్నట్టు స‌మాచారం.

తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డికి ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగ‌దా ఇందుకూరుపేట మండ‌లం కొరుటూరులో ప‌ర్య‌టించిన న‌ల్ల‌పురెడ్డికి సొంత పార్టీ నేత‌లే నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదురైన‌ట్టు మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. కొరుటూరులో త‌న‌కు డ‌బ్బులు రావాల్సి ఉంటే.. వైఎస్సార్సీపీ కార్యక‌ర్త‌లే అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త షేక్ ర‌ఫీ ఎమ్మెల్యేని నిల‌దీసిన‌ట్టు సమాచారం.

కార్యకర్తలకేం చేశారు. గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేశారా?' అంటూ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని సొంత పార్టీకే చెందిన‌షేక్‌ రఫీ ప్ర‌శ్నించారు. 2024 ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని ప‌లువురు సవాళ్లు కూడా విసిరిన‌ట్టు చెబుతున్నారు.

త‌మ ప‌శువులు చనిపోతే పరిహారం రాలేద‌ని మ‌రికొంత‌మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. పశు వైద్యులు గ్రామంలో అందుబాటులో ఉండటం లేద‌ని గ్రామ ఉప సర్పంచి తుమ్మల ప్రసాద్‌ చిన్నాన్న శీనయ్య ఎమ్మెల్యేను ప్ర‌శ్నించారు.

దీనిపై స్పందించిన ఉప సర్పంచి తుమ్మ‌ల‌ ప్రసాద్‌.. ''ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా?'' అంటూ తన చిన్నాన్నను కొట్టుకుంటూ తీసుకెళ్లార‌ని చెబుతున్నారు. ఇలా ప‌లుచోట్ల ప్ర‌జ‌ల నుంచి, వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డికి చిక్కులు ఎదుర‌య్యాయ‌ని అంటున్నారు.
Tags:    

Similar News