ప్రముఖ నటుడిపై నమోదైన లైంగిక వేధింపులు అపహరణ కేసు అతన్ని వెంటాడుతూనే ఉంది. ఈ కేసును విచారిస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసు విభాగం ఈ కేసుపై విచారిస్తున్న అధికారులను కంట్రోల్ చేసేందుకు అతడు ప్లాన్ రచిస్తున్నారని దీని కారణంగా సదరు నటుడిపై తాజాగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. కేరళ పోలీసు క్రైమ్ బ్రాంచ్ విభాగం మలయాళ నటుడు దిలీప్ పై ఆరోపించిన ఆడియో క్లిప్ తర్వాత అతనిపై కేసు నమోదు చేసారని వెల్లడైంది. 2017 లో తనపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులను చంపే ప్రణాళిక గురించి చర్చిస్తున్నట్లు ఆడియో వినిపించింది. దీంతో సదరు హీరోపై ఓ చిత్ర నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమస్య క్రైమ్ బ్రాంచ్ వరకు చేరిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఫిర్యాదుకు ప్రతిస్పందనగా ఈ వ్యవహారంలో దిలీప్ తో పాటు మరో ఐదుగురిపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదైంది.
అధికారులను హతమార్చేందుకు ప్రణాళికలు రచించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోపై అతడు చేయాలనుకున్న నేరాలకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. కొత్త ఆరోపణలకు సంబంధించి నిందితుడిపై దాఖలైన ఎఫ్.ఐ.ఆర్ లో తనపై నమోదైన కేసు దానికి కారకుడైన అధికారి ప్రాణాలు తీయడానికి కుట్ర పన్నాడని పేర్కొంది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.
రన్నింగ్ వాహనంలో ప్రముఖ కథానాయకను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన సంచలన కేసుకు సంబంధించి సదరు నటుడు 2017 నుండి వార్తల్లో నిలిచారు. ఈ ఘటనలో ఎనిమిదో నంబర్ నిందితుడైన మలయాళ నటుడు దిలీప్ సహా మొత్తం ఎనిమిది మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులపై హత్యా యత్న ఆడియోతో కేసు విచారణ కోసం కోర్టుకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై ఎర్నాకులం అదనపు ప్రత్యేక సెషన్స్ కోర్టు విచారణ జరుపుతోంది. నిందితులపై నమోదైన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నాలుగేళ్ల క్రితం జరిగిన వేధింపుల ఘటన కేసులో కేసులో కొత్త పరిణామంగా మారింది.