కాపుల రిజర్వేషన్ కోసం సాగుతున్న పోరాటంలో రెండో దశ మరింత ఉధృత రూపం దాల్చుతున్నట్లుగా కనిపిస్తోంది. కాపు ఉద్యమనేత - మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన పోరాటానికి సినీ నటి హేమ మద్దతిచ్చారు. కాకినాడలో జరిగిన కాపు మహిళ సదస్సులో పాల్గొన్న హేమ ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. కాపులకు న్యాయబద్దమైన రిజర్వేషన్ల డిమాండ్‌ను సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాపులకు సంఘీభావం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు హేమ తెలిపారు.
కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వడం తప్పేమీ కాదని, ఈ న్యాయమైన డిమాండ్ కు మద్దతు ఇచ్చేందుకు తాను సినీ పరిశ్రమ నుంచి వచ్చినట్లు హేమ వెల్లడించారు. ఈ సమావేశానికి వచ్చినందుకు తనను సినీ పరిశ్రమలో తొక్కేస్తారనే భయం లేదని వ్యాఖ్యానించారు. కాపులకు బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చిన టీడీపీ ఇపుడు ఆ హామీని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఈ సందర్భంగా కంచాలను గరిటెలతో కొడుతున్న నిరసనలో హేమ భాగస్వామ్యం పంచుకున్నారు. ఇదిలాఉండగా 2014 ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి హేమ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/