మైనర్ బాలికలను లైంగికంగా వేధిస్తూ ప్రముఖ మలయాళ నటుడు, విలన్ శ్రీజిత్ రవి అడ్డంగా బుక్కయ్యారు. సీసీ టీవీ కెమెరాల్లో అతడి లైంగిక వేధింపులు రికార్డు కావడంతో పోలీసులు అతడిని జూలై 7న గురువారం అరెస్టు చేశారు. గతంలోనూ ఇలాంటి కేసులోనే అరెస్టు అయినా శ్రీజిత్ రవి బుద్ధి మారలేదని పోలీసులు చెబుతున్నారు. పాఠశాలలకు వెళ్లే అమ్మాయిలే అతడి టార్గెట్ అని తెలుస్తోంది.
తాజాగా 9, 14 ఏళ్ల మైనర్ బాలికల పట్ల శ్రీజిత్ రవి అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడైంది. బాధిత బాలికల ఫిర్యాదు చేయడంతో శ్రీజిత్ రవిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. జూలై 4న కేరళలోని త్రిస్సూర్‌లోని ఎస్‌ఎన్ పార్క్‌లో శ్రీజిత్ రవి ఇద్దరు బాలికల పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు.
కాగా శ్రీజిత్ రవి గతంలోనూ పాఠశాలల అమ్మాయిలను లైంగికంగా వేధించాడని చెబుతున్నారు. 2016లో ఓట్టప్పలం పోలీసుల ఇలాంటి కేసులోనే అతడిని అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. కొందరు పాఠశాలల అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడటమే కాకుండా.. అతడి ప్రైవేట్ పార్ట్సును వారికి చూపించాడని అంటున్నారు.
అంతేకాకుండా ఆ బాలికలతో బలవంతంగా ఫొటోలు కూడా తీసుకున్నాడని పేర్కొంటున్నారు. ఈ విషయంపై అప్పట్లో బాలికల స్కూలు ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. అసభ్యకరరీతిలో అతడి ప్రైవేటు పార్ట్స్‌ను చూపిస్తూ అసభ్యకర రితీలో ప్రవర్తించడమే కాకుండా బాలికల ఫొటోలను తీసుకున్నాడు. దీంతో స్కూల్ ప్రిన్స్‌పాల్‌య ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
మలయాళ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే శ్రీజిత్ రవి నిజ జీవితంలోనూ విలన్ గానే ప్రవర్తిస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. అతడిని ఈసారైనా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు మలయాల చిత్ర పరిశ్రమలో గతంలో దిలీప్.. నటి భావనను ఇలాగే వేధించిన ఘటన తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.