రజనీతో అతడి భేటీ ఇప్పుడు చర్చగా మారింది

Update: 2017-03-03 09:41 GMT
సొంత నియోజకవర్గ ప్రజల చేతిలో ఊహించని విధంగా చేదు అనుభవం ఎదురైన నటుడు కమ్ పొలిటీషియన్ కరుణాస్ తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. అధికార అన్నాడీఎంకేలోని శశికళ వర్గానికి చెందిన కరుణాస్.. సూపర్ స్టార్ రజనీకాంత్ తో భేటీ కావటం.. దాదాపు అరగంట పాటు ఆయన ఇంట్లో గడపటం తమిళనాడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తావిచ్చింది. రజనీని తమవైపు ఆకర్షించేందుకు బీజేపీ కిందామీదా పడుతున్న వేళ.. పాలకపక్షానికి చెందిన ఎమ్మెల్యే రజనీని భేటీ కావటం వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా? అన్నది ఆసక్తికర చర్చ సాగుతోంది.

రజనీని కరుణాస్ ఎందుకు కలిశారన్న అన్న అంశంపై సాగుతున్న చర్చకు ఆయన తెర దించే ప్రయత్నం చేశారు. తాను మర్యాదపూర్వకంగానే కలిశానే తప్పించి.. తమ భేటీకి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. రజనీకాంత్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన నటించిన భాషా చిత్రాన్ని డిజిటలైజ్ చేస్తున్న వేళ.. ఆయన్ను గౌరవంగా కలిసినట్లుగా చెప్పుకొచ్రు.

అమ్మ మృతిపై వస్తున్న అనుమానాల్ని తేలిగ్గా కొట్టేసిన ఆయన.. అమ్మ మృతిపై న్యాయవిచారణను డిమాండ్ చేయటం అర్థరహితమని చెప్పటం గమనార్హం. మొత్తానికి తన భేటీలో ఎలాంటి రాజకీయం లేదని కరుణాస్ చెబుతున్నా.. ఏదో కారణం లేకుండా భేటీ కావటం ఉండదన్న మాటను తమిళనాడు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News